Homeఅంతర్జాతీయంఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

వరుసగా ఢీకొన్న వాహనాలు
63 మంది దుర్మరణం
నైరోబీ: ఉగాండాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన రెండు బస్సులు ఢీకొన్నాయి. ఇదే క్రమంలో మరికొన్ని వాహనాలు ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 63 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. కంపాలా`గులు హైవేపై ఈ దుర్ఘటన సంభవించింది. బస్సు డ్రైవర్‌ ఓవర్‌టేక్‌ కోసం ప్రయత్నించగా మరో బస్సును ఢీకొట్టబోయి వాహనంపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొనగా… మరొకొన్ని వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. చెయిన్‌ రియాక్షన్‌ జరిగిందని పోలీసులు తెలిపారు. కిర్యాడోంగా హాస్పిటల్‌తో పాటు సమీప వైద్య కేంద్రాల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడిరచారు. ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. రోడ్డు నియమాలను వాహనదారులు పాటించాలని ఎక్స్‌ మాధ్యమంగా పోలీసులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు