Homeఅంతర్జాతీయంజన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్‌ ఆదేశాల నిలిపివేత

జన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్‌ ఆదేశాల నిలిపివేత

- Advertisement -

కాంకర్డ్‌: అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూహాంప్‌షైర్‌ ఫెడరల్‌ జడ్జి జోసెఫ్‌ లా ప్లాంటీ నిలిపేశారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని ఆదేశాలిచ్చారు. దీనిపై ఫిర్యాదుకు వీలుగా ఏడు రోజుల స్టే ఇచ్చారు. ఫెడరల్‌ జడ్జి నిర్ణయంతో సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరగనుంది. ఫెడరల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు దేశమంతటా వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు