న్యూదిల్లీ: జాన్సన్ కంట్రోల్స్-హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్, ఢల్లీి స్కిల్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (డీఎస్‌ఈయూ) తాజాగా డీఎస్‌ఈయూ క్యాంపస్‌లో ప్రపంచ స్థాయి హెచ్‌వీఏసీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాయి. ఇవి విద్యార్థులు, సాంకేతిక నిపుణుల ‘హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) సాంకేతికతలలో పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించడానికి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఉద్దేశించినవి. జాన్సన్ కంట్రోల్స్-హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్, ఢల్లీి స్కిల్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ (డీఎస్‌ఈయూ) మధ్య 2024 అక్టోబరులోనే అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత విద్యార్థులు, సాంకేతిక నిపుణుల కోసం డీఎస్‌ఈయూ క్యాంపస్‌లో పూర్తి హెచ్‌వీఏసీ శిక్షణా పరికరాలతో హెచ్‌వీఏసీ శిక్షణా కేంద్రాన్ని స్థాపించింది. ఈ సహకారంలో భాగంగా, జాన్సన్ కంట్రోల్స్-హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్ హెచ్‌వీఏసీ యూనిట్లు, పరికరాలు, శిక్షణ సామగ్రితో సహా అత్యాధునిక వనరులను అందించింది.