Homeవిశ్లేషణ‘డిజిటల్ అరెస్టు’ ఉత్తదే… ఎవరూ నమ్మొద్దు

‘డిజిటల్ అరెస్టు’ ఉత్తదే… ఎవరూ నమ్మొద్దు

- Advertisement -

ఆమె బెంగుళూరుకు చెందిన వృద్ధురాలు. పేరు లక్ష్మీˆ రామూˆర్తి. వయస్సు 70 సంవత్సరాలు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్లలందరూ చదువులు పూర్తయి విదేశాల్లో స్థిరపడ్డారు. ఎలాంటి బాదరబందీ లేకుండా జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే ఆలోచనలో స్థిరచరాస్తులు అన్నీ విక్రయించేసి సొమ్ములన్నీ బ్యాంకులో దాచిపెట్టారు. మొత్తం దాదాపు 24 కోట్ల దాకా ఉంటుంది. హమ్మయ్య… ఇకనేం…కృష్ణా, రామా అంటూ బతికేయొచ్చు అనుకున్నారేమో. మే నెల మొదటి వారంలో ఆమెకు ఒక వీడియో కాల్ వచ్చింది. విదేశాల నుంచి పిల్లలు చేసుంటారని ఆనందంగా ఫోన్ తీసారామె. స్క్రీన్ మీద పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. “ఈ మధ్య మీరు అక్రమ బ్యాంకు లావాదేవీలు చేశారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేశామంటూ” హుకుం జారీ చేశారు. దాంతో ముసలావిడ భయంతో వణికి పోయారు. వాళ్లిచ్చిన వివిధ ఖాతాల్లోకి సొమ్మును ట్రాన్స్ఫర్ చేశారు. విడతలవారీగా 24 కోట్ల రూపాయలు లాగేశారు. ‘మీరు కేసు నుంచి బయటపడాలంటే ఇంకా డబ్బు కట్టాలంటూ’ బెదిరించారు. దాంతో చేసేది లేక ఇంట్లో వున్న కిలోన్నర బంగారాన్‌ని తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు వెళ్లారు. ఆమె ముఖంలో కంగారుని గమనించిన మేనేజర్ ఆరా తీస్తే, జరిగిందంతా చెప్పారావిడ. మోసపోయారని గ్రహించిన బ్యాంకు అధికారులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దేశమంతా గాలించి బొంబాయి, దిల్లీకి చెందిన ఇద్దరు నేరగాళ్లను అరెస్ట్ చేసి, వివిధ ఖాతాల నుంచి పాతిక లక్షల దాకా రికవరీ చేశారు. అసలు బాస్ కోసం గాలిస్తున్నారు. ఇది తాజాగా జరిగిన సంఘటన. డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవని ఒక వైపు పోలీసులు, మరో పక్క మీడియా ఎంత ప్రచారం చేస్తున్నా జనం ఇంకా మోసపోతుండడం ఆందోళన కలిగించే అంశమే. ఈ సంఘటనలో బాధితురాలు ఒక వృద్ధ మహిళ. మోసపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, న్యాయమూర్తులు, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కూడా సైబర్ ‘కంత్రీ గాళ్ల’ వలలో చిక్కుకుని మోసపోతుండడం మింగుడు పడని విషయం. ఎక్కడెక్కడ నుంచి సైబర్ నేరగాళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు అనేది చెప్పడం కష్టమైన విషయం. సైబర్ సెక్యూరిటీ లేని దేశాల్లో వీరు ఎక్కువగా ఉంటారని తేలింది. అలాగని అన్ని రక్షణ వలయాలు ఉన్న దేశాల్లో వీరి ఉనికి లేదా అంటే ఉందనే చెబుతున్నారు పరిశోధకులు. అత్యంత పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కలిగిన దేశాలను సైతం సైబర్ నేరస్తులు ‘అడ్డాలు’ గా చేసుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నమ్మలేని నిజం. ఈ మధ్య ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ‘సైబర్ ఇండెక్స్‌ ర్యాంకింగ్’ ఒక జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రష్యా మొదటి స్థానంలో ఉండగా, చైనా, నార్త కొరియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక అమెరికా నాలుగో స్థానంలోనూ, నైజీరియా ఐదో స్థానంలో ఉన్నాయి. మెకిస్కో, కొలంబియా, సూడాన్, ఆఫ్ఘానిస్థాన్, తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ విషయంలో భారతదేశం 52వ ర్యాంకింగులో వున్నా, రికవరీ విషయంలో ప్రపంచానికి ‘రోల్ మోడల్’ గా వున్నట్టు నేషనల్ సైబర్ సెక్యురిటి ఇండెక్స్‌ ద్వారా తెలుస్తోంది. ఇక మన దేశంలో సైబర్ నేరగాళ్లు బొంబాయి, దిల్లీ నగరాల్లో ఎక్కువగా వున్నట్టు తేలింది. బెంగళూరు, కలకత్తా, నాగపూర్, పాట్నా వంటి నగరాల నుంచి కూడా సైబర్ కేటుగాళ్ళు తమ ‘దందా’ కొనసాగిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని సైబర్ నేరాల నియంత్రణ చట్టాలు పటిష్టంగా ఉన్నాయని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల వ్యూహాలను తిప్పికొట్టడంలోనూ, ప్రతి వ్యూహాలు పన్నడంలోనూ మన పోలీసులు ముందంజలో వున్నట్టు తెలుస్తోంది. ‘నేషనల్ సైబర్ క్రైమ్ కో- ఆర్డినేషన్ సెంటర్’ అందించిన వివరాల మేరకు ఈ ఏడాది వివిధ సైబర్ ముఠాల నుంచి 8700 కోట్ల వరకూ రికవరీ చేశారు. దాంతో పాటు సైబర్ నేరం జరగబోతోందని ముందుగానే పసిగట్టి 4800 కోట్ల రూపాయలు సైబర్ నేరస్తుల చేతికి అందకుండా చేశారు. సైబర్ నేరస్తుల నుంచి దాదాపు 10 లక్షల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మూడు లక్షల నకిలీ అకౌంట్లను స్తంభింపచేశారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించి 20 వేల మంది కేటుగాళ్లను మన పోలీసులు అరెస్టు చేయడం విశేషం. ఇంకా లక్షల కోట్ల సొమ్ము సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉంది. దాన్ని రికవరీ చేయడానికి చాలా ఇక్కట్లే ఎదురౌతున్నాయి. సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్మును ‘లేయర్’ అనే క్లిష్టమైన ప్రాసెస్ ద్వారా బదిలీ చేస్తుండడం వల్ల దాన్ని ఛేదించడం పోలీసుల వల్ల కావడం లేదు.. అందువల్లనే లక్షల కోట్లలో దోపిడీకి గురవుతున్నా, రికవరీ అవుతోంది వేల కోట్ల రూపాయలే. ఇన్ని సైబర్ నేరాలు, ఘోరాలు జరుగుతున్నా వీటిని నియంత్రించే మార్గాలే లేవా అంటే ఉన్నాయనే చెబుతున్నారు నిపుణులు. విష వలయంలా మారిన సైబర్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. చర్యలు చేపట్టేందుకు మన దేశంలో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000’పేరుతో పార్లమెంట్ ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ఆధారిత నేరాలను నియంత్రించి, సైబర్ కేటుగాళ్ల ఆటలు కట్టించేందుకు నిర్దేశించిన ఈ చట్టానికి అనేక మార్పు, చేర్పులు చేశారు. అయినా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో చెలరేగిపోతున్నారు. లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిష్కార మార్గాలు, పాటించాల్సిన నియమాలను నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో మొదటిది మనం ఉపయోగించే మొబైళ్లు, కంప్యూటర్, ల్యాప్టాప్, నోట్ ప్యాడ్లకు సురక్షితమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలి. కష్టమైన, క్లిష్టమైన పాస్వర్డ్స్‌ ఎంపిక చేసుకోవాలి. రెండంచల భద్రతా వ్యవస్థను సమకూర్చు కోవాలి. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్Y అప్‌డేట్ చేస్తుండాలి. నకిలీ కాల్స్‌, మెయిల్స్‌ను గుర్తించే యాంటీ మాల్వేర్‌ను వాడాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారాల విషయంలో వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి వివరాలు అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో బహిర్గతం చేయకూడదు. రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్‌ తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైఫై సౌకర్యాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగిం# áకండి. అపరిచిత, అనుమానిత లింకులను ప్రెస్ చేయకండి. అవి స్పాములు కావొచ్చు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలను అడగవని తెలుసుకోండి. ఒకవేళ అడిగినా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని రెస్పాన్¦ అవ్వండి. అభ్యంతరకరమైన మెసేజ్లు, సంచలన వివరాలు వచ్చినప్పుడు నిజనిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్) చేసుకున్నాకనే విశ్వసించండి. మీ కంప్యూటర్, మొబైల్ లోకి ఎవరైనా అనుమానితులు చొరబడ్డారని అనుమానం వస్తే ఇంటర్నెట్ తొలగించండి. లేదంటే మీ విలువైన సమాచారం సైబర్ కేటుగాళ్ల పరమౌతుంది. మీ బ్యాంకు ఖాతానుంచి కానీ, క్రెడిట్ కార్డు నుంచి కానీ మీకు తెలియకుండా లావాదేవీలు జరిగినట్టు అనుమానం వస్తే బ్యాంకు సిబ్బందికి ఫోన్ చేసి మీ ఖాతాలను స్తంభింప చేయించండి. వెంటనే పాస్వర్డ్స్‌ మార్చేయండి. ఎలాంటి సైబర్ నేరం జరిగిందని అనుమానం వచ్చినా వెంటనే సమీపంలోని సైబర్ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ కంట్రోల్ నంబరు 1930 కు కూడా వివరాలతో ఫిర్యాదు చేయడం మరువొద్దు. అలాగే ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోరట్ల్’ కి ఫిర్యాదు చేయండి. చాలామంది భయంతోనో, వివరాలు బయటకు వస్తాయన్న బిడియం తోనో ఫిర్యాదు చేయడం మానేస్తారు. అలాంటి వారే మళ్లీ మళ్లీ మోసపోతుంటారు. ఫిర్యాదు చేస్తే పోయేదేముంది.? మహా అయితే పోయిన సొమ్ము రికవరీ అవుతుంది…! అప్రమత్తంగా ఉండండి.
జర్నలిజం మాజీ విభాగాధిపతి-డీన్,
ఆంధ్ర విశ్వవిద్యాలయం, 9393100566

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు