మున్సిపల్ ఫలితాల లెక్క తెలుతోంది.
మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 65 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీల్లో గెలుపొందింది.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం
18 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.
ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే..
ఆలేరు కాంగ్రెస్‌దే
ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
మొత్తం 12 వార్డుల్లో ఏడింటిని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది
బీఆర్ఎస్కు 3, భాజపాకు2 దక్కాయి.
జమ్మికుంట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
కరీంనగర్ జిల్లా జమ్మికుంట కౌంటింగ్ శిబిరానికి వెళ్లకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాధను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థిని కారులో తీసుకెళ్లిన ఆ పార్టీ శ్రేణులు
ఈ మున్సిపాలిటీల్లో హంగ్..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ కొలిక్కి వస్తున్నాయి.ఈ క్రమంలో చాలా మున్సిపాలిటీల్లో ఫలితాలు తేలగా మరికొన్నింటిలో హంగ్ ఏర్పడింది.దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్, ఆలియాబాద్, గద్వాల, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.
గద్వాల మున్సిపల్ ఫలితాలు ఇలా..
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి.
మొత్తం 37 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది.
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 15 వార్డుల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ 12, భాజపా 7, ఎంఐఎం 1, స్వతంత్రులు 2 వార్డుల్లో గెలుపొందారు.
చెన్నూరులో కాంగ్రెస్ విజయం
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
మొత్తం 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి 11 దక్కాయి.
బీఆర్ఎస్ 4, భాజపా 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్‌ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు
వెంకటేశ్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు
తోపులాట జరగడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం
తిరుమలగిరిలో బీఆర్ఎస్ విజయకేతనం
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది.
మొత్తం 15 వార్డులకు గానూ బీఆర్ఎస్ 10 వార్డుల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపొందింది.
నల్గొండలో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్
నల్గొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
మున్సిపాలిటీల వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
రాయికల్‌లో నో మ్యాజిక్ ఫిగర్
జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డుల్లో 5 వార్డులు గెలుచుకున్న భాజపా
3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ గెలుచుకున్నాయి
ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్
పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా..
పెద్దపల్లి : మొత్తం 36 వార్డులకు గానూ కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 1, భాజపా 1, ఫార్వర్డ్ బ్లాక్ 5, ఇండిపెండెంట్ 2 గెలుపొందారు
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మొత్తం 12లో 10 వార్డుల్లో విజయం సాధించిన కాంగ్రెస్
వేములవాడలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్
వేములవాడ : 28 వార్డుల్లో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, భాజపా 8, ఇతరులు 2
సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్
12:53(IST)
జనగామలో బీఆర్ఎస్ జయకేతనం
జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, ఇతరులు 5
మద్దూరులో కాంగ్రెస్ విజయం
నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది.
16 వార్డులకు ఎన్నికలు జరగ్గా, 9 వార్డులను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
బీఆర్ఎస్ 6, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు.
కోదాడ కాంగ్రెస్‌దే
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 27 వార్డులను కాంగ్రెస్ దక్కించుకుంది.
బీఆర్ఎస్ 3, స్వతంత్రులు 5 వార్డుల్లో విజయం సాధించారు.
జహీరాబాద్‌లో ఫలితాలు ఇలా..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడ్డాయి.
మొత్తం 37 వార్డులకు గానూ అత్యధికంగా 15 వార్డులను బీఆర్ఎస్ దక్కించుకుంది.
కాంగ్రెస్ 14, భాజపా 3, స్వతంత్రులు 3, ఎంఐఎం 2 వార్డుల్లో విజయం సాధించాయి.
గుమ్మడిదలపై గులాబీ జెండా
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
మొత్తం 22 వార్డులకు గానూ 15 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది
కాంగ్రెస్ 4, భాజపా 2, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు.
నేరేడుచర్లలో ఖాతా తెరిచిన జనసేన
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
మొత్తం 15 స్థానాలకు గానూ 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, ఒక వార్డును జనసేన దక్కించుకుంది.
కేసముద్రం.. మ్యాజిక్ ఫిగర్ దాటని పార్టీలు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు.
మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఎనిమిది వార్డుల్లో విజయం సాధించాయి.
నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ విజయం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.
మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ 11 వార్డుల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ 3, భాజపా 1 గెలుపొందాయి.
మంథనిలోనూ కాంగ్రెస్‌దే విజయం
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది.
13 వార్డుల్లో కాంగ్రెస్‌కు 11 దక్కాయి.
బీఆర్ఎస్, ఇతరులు చెరొక వార్డు సొంతం చేసుకున్నాయి.
బిచ్కుంద, ఎల్లారెడ్డి కాంగ్రెస్‌వే..
కామారెడ్డి జిల్లా బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
బిచ్కుందలో 12 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 10, బీఆర్ఎస్, ఇతరులు చెరో వార్డులోనూ గెలుపొందారు.
ఎల్లారెడ్డిలోనూ కాంగ్రెస్ 10, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డును సొంతం చేసుకున్నారు.
భీంగల్ కాంగ్రెస్ ‘హస్త్ణగతం
నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
12 వార్డుల్లో 8 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ దక్కించుకున్నాయి.
ధర్మపురి కాంగ్రెస్‌దే
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది.
మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇప్పటివరకూ వెల్లడైన 10 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
హుజూర్నగర్ కాంగ్రెస్‌దే
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది.
28 స్థానాలకు గానూ 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు
బీఆర్ఎస్ 4, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ కైవసం
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది.
ఎనిమిది స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో వార్డును సొంతం చేసుకుంది.
తొర్రూరులో బీఆర్ఎస్ విజయం
మహబూబాబాద్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది.
మొత్తం 16 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 వార్డుల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ 6 వార్డుల్లో గెలుపొందింది.
దేవరకద్రలో నో మ్యాజిక్ ఫిగర్
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.
మొత్తం 12 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, భాజపా 1, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
నేరేడుచర్లలో కాంగ్రెస్ జయకేతనం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది.
మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 9 వార్డుల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ 5, ఇతరులు ఒక వార్డులో గెలుపొందారు.
చిట్యాలలో ట్రాన్‌జెండర్ విజయం
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు.
ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాగిళ్ల సుధాకర్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
తాజా ఫలితాల్లో 102 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
కోహీర్ మున్సిపాలిటీ ఫలితాలు ఇలా..
సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
మొత్తం 16 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 8 వార్డుల్లో గెలిచింది.
బీఆర్ఎస్ 5, భాజపా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో వార్డులో గెలిచారు.
అయిజ బీఆర్ఎస్దే..
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసమైంది.
మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 13వార్డులను దక్కించుకోగా, 7 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
మరిపెడలో ఎగిరిన కాంగ్రెస్ జెండా
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది.
మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 8 వార్డుల్లో విజయం సాధించింది.
బీఆర్ఎస్ 6, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు.
సుల్తానాబాద్లోనూ కాంగ్రెస్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది.
మొత్తం 15 వార్డులకు గానూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
భాజపా, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు.
డోర్నకల్‌లో హస్తం పార్టీ విజయం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది.
మొత్తం 15 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ దక్కించుకోగా, నాలుగింటిలో బీఆర్ఎస్ విజయం సాధించింది.
కల్వకుర్తి మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే..
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడుతున్నాయి.
16 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లలితమ్మ గెలుపొందారు.
ఏడో వార్డులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రత్నమాల విజయం సాధించారు.
హాలియాలోనూ కాంగ్రెస్‌దే విజయం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీని కాంగ్రెస్ చేజిక్కించుకుంది
మొత్తం 12 వార్డులకు గానూ ఇప్పటికే 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది
22 వార్డులకు గానూ 17 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2 బీఆర్ఎస్, ఒకటి భాజపా దక్కించుకున్నాయి.
దేవరకొండలో స్వతంత్ర అభ్యర్థి విజయం
నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.
19వార్డు నుంచి పోటీ చేసిన శ్రీధర్ గెలుపొందారు.
నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది.
12 వార్డులకు గానూ 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది.
గడ్డపోతారం మున్సిపాలిటీపై గులాబీ జెండా
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
మొత్తం 18 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 వార్డుల్లో విజయం సాధించింది.
కాంగ్రెస్ మూడు, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
ఎల్లంపేట్లో గెలుపొందిన వాళ్లు వీరే..
మేడ్చల్ మల్కాజిగిరి ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఫలితాలు వెల్లడవుతున్నాయి.
10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం.
16 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సద్ది సురేశ్ కుమార్‌రెడ్డి గెలుపొందారు.
మధిరలో తెదేపా జెండా రెపరెప
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఫలితాల్లో తెదేపా జెండా రెపరెపలాడింది.
10వ వార్డులో తెదేపా అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు.
భువనగిరిలో ఫలితాలు ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడవుతున్నాయి.
ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి గెలుపొందారు.
ఆలియాబాద్ మున్సిపాలిటీలో విజయం వీరిదే..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడవుతున్నాయి.
7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్ విజయం సాధించారు.
4వ వార్డులో భాజపా అభ్యర్థి దీపిక..
19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
ములుగు ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.
ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇంద్రేశంలో తొలి విజయం కాంగ్రెస్‌కే
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.
15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి విజయం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడైంది.
12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు.
యాదగిరిగుట్టలో మున్సిపల్ ఫలితాలు ఇలా..
యాదిగిరి గుట్టలో మున్సిపల్ ఫలితాలు వస్తున్నాయి.
ఒకటో వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపొందారు.
4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న విజయం సాధించారు.
10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి విజయం


