Homeఅంతర్జాతీయందక్షిణ కొరియాకు జనాభా సంక్షోభం

దక్షిణ కొరియాకు జనాభా సంక్షోభం

- Advertisement -

సియోల్‌: దక్షిణ కొరియా సైనిక శక్తి గత ఆరేళ్లలో 20 శాతం తగ్గినట్లు ఆ దేశ రక్షణశాఖ తాజా నివేదిక వెల్లడిరచింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటు ఉన్న దేశంలో సైనిక సేవల కోసం నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని తెలిపింది. సైనిక సేవలందించే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం అధికారుల సంఖ్యలోనూ తగ్గుదలకు కారణమవుతోందని రక్షణశాఖ వెల్లడిరచింది. తద్వారా కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందిగా మారినట్లు అభిప్రాయపడిరది. దక్షిణ కొరియా సైన్యంలో చేరేందుకు కనీస వయసు 20 ఏళ్లు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో ఈ వయసున్న వారి సంఖ్య 2019-25 మధ్యకాలంలోనే 30 శాతం తగ్గినట్లు అంచనా. 2000 మొదట్లో సైన్యం సంఖ్య 6.9 లక్షలు ఉండగా ప్రస్తుతం అది 4.5 లక్షలకు తగ్గింది. గడిచిన ఆరేళ్లలోనే సైన్యంలో 20 శాతం (దాదాపు 1.3 లక్షలు) క్షీణత కనిపించింది. 2019లో ఈ సంఖ్య 5.63 లక్షలుగా ఉంది. అదే ఉత్తర కొరియాకు మాత్రం భారీ సైనిక శక్తి ఉంది. రక్షణశాఖ వివరాల ప్రకారం 2022లో కిమ్‌ దాదాపు 12 లక్షల సైన్యాన్ని కలిగి ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు అమెరికాతో కలిసి పనిచేస్తున్న దక్షిణ కొరియా… ఏటా భారీ స్థాయిలో (2025లో 33 బిలియన్‌ పౌండ్లు) కేటాయింపులు చేస్తోంది. మరోవైపు ప్రపంచంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. 2024లో ఇక్కడ జననాల రేటు 0.75 శాతంగా ఉంది. 2020లో 5.1 కోట్ల జనాభా ఉండగా, 2072 నాటికి 3.6 కోట్లకు పడిపోనున్నట్లు అంచనా.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు