విశాలాంధ్ర – జేఎన్టియుఏ:సామాన్య ప్రజలకు సైతం ఆవిష్కరణలు అందుబాటులో ఉండాలి కృషి చేయాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ సుదర్శన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం కార్యాలయం ప్రాంగణంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ .. దేశంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషణ చేపట్టి దేశ అభివృద్ధిలో పునరంకితం కావాలని వీసీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు దీటుగా ఎదుర్కొనేలా.. సరికొత్త విద్య, నైపుణ్యాలను విద్యార్థులకు చేరువు చేస్తున్న మన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య,
ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. వసుంధర , యూనివర్సిటీ డైరెక్టర్లు, విభాగాధిపతులు, స్పోర్ట్స్ కౌన్సిల్ డాక్టర్ టి. నారాయణ రెడ్డి , జోజిరెడ్డి , అవుట్ సోర్సింగ్ సిబ్బంది, విధ్యార్థులు పాల్గొన్నారు.
సామాన్య ప్రజలకు సైతం ఆవిష్కరణలు అందుబాటులో ఉండాలి : వీసీ సుదర్శన్ రావు
- Advertisement -


