Homeసాహిత్యంన్ఙిడతా కావ్యం రాచపాళెం ‘పొలి’

న్ఙిడతా కావ్యం రాచపాళెం ‘పొలి’

- Advertisement -

“నిబద్ధత ఉన్న సాహిత్యం పీడితుల్ని నడిపిస్తుంది
నిమగ్నత ఉన్న సాహిత్యం సామాన్యుల వెంట ఉండి
రక్షించి విముక్తి పథంలో ముందుకు తీసుకుపోతుంది.
న్ఙిడత ఉన్న సారస్వతం పీడితుల జీవితంగా, వాక్కుగా,
పీడితుల ఉద్ధరణారœం సామూహికంగా విముక్తి పథం అన్వేషిస్తుంది.
(ఆచార్య కొలకలూరి : ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, పు` 26)
రాచపాళెంగా సాహితీ క్షేత్రంలో ప్రసిద్ధులైన కవి, సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. ఆయన ప్రధానంగా సాహిత్య విమర్శకులు. కొన్ని కవితలు కూడా రాశారు. అనుకోకుండా “పొలి” అని ఒక దీర్ఘకవిత కూడా రాశారు. దాన్నిపాఠకులు బాగా అధ్యయనం చేశారు. కొందరు పరిశోధన చేశారు. ఆ కావ్యం 2007-2020 మధ్య మూడుసార్లు ప్రచురించారు. ఆంగ్ల (డాక్టర్ పతికి రమేష్ నారాయణ), హిందీ (జూటూరు షరీఫ్) భాషలలోకి అనువాదమైంది. తిరుపతిలోని నూతలపాటి గంగాధరం స్మారక పురస్కారం పొందింది. రాచపాళెం పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. బాల్యంలో వాళ్ల నాన్నగారి శిక్షణలో వ్యవసాయంలో బాగా నలిగినట్లు ఆయన చాలాసార్లు చెప్పకొన్నారు. రాచపాళెం తండ్రి రామిరెడ్డిగారి జీవితం వస్తువుగా ఆయన రాసిన కావ్యం “పొలి”. ఆ కావ్యంలో రాచపాళెం, వారి నాన్నతోపాటు, వారి గ్రామం కుంట్రపాకంలోని అన్ని వృత్తుల వారూ ఉన్నారు. అందువల్ల రచనలో రచయిత ఉండటం న్ఙిడత అన్న కొలకలూరి వారి నిర్వచనం ప్రకారం “పొలి” కావ్యం న్ఙిడతా కావ్యం అవుతుంది.
ఒక ఇంటర్వ్యూలో రాచపాళెం మాట్లాడుతూ, వ్యవసాయంతో సంబంధం లేని మహిళ “పొలి” కావ్యం చదివి, తాను కొనుక్కుని తినే బియ్యం పండటం వెనక ఇంత శ్రమ ఉందా అని ఆశ్చర్యపడుతూ ఫోన్ చేశారని చెప్పారు. ఆమె మాటలు విన్నాక రాచపాళెం కళ్లలో నీళ్లు తిరిగాయని ఆయన ఆర్రÝంగా చెప్పుకున్నారు. “పొలి” కావ్యంలో ప్రతి అక్షరం రాచపాళెం వ్యవసాయాను భవాన్ని, ప్రతిపదం ఆయన భావనాశక్తిని నిరూపిస్తున్నాయి. “రైతు జీవితం లోని కఠోర సత్యాలను కవితాపరంగా వెల్లడిస్తూనే, రాచపాళెం బరువైన భావాలను కళాత్మక పద చిత్రాల ద్వారా వ్యంగ్య వైభవంతో మనలోకి బట్వాడా చేస్తాడు” అని ప్రసిద్ధ పత్రికా సంపాదకులు డాక్టర్ ఏ.బి.కే ప్రసాద్ “పొలి” కావ్యం మీద రాసిన వ్యాసంలో అన్నారు.
1995 – 2005 మధ్య, ముఖ్యంగా 2000 – 2004 మధ్య రాయలసీమను, ప్రత్యేకించి అనంతపురం జిల్లాను అతలాకుతలం చేసిన కరువుకాలంలో అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు జరిపిన “కరువు అధ్యయన యాత్ర”, “రైతు ఆత్మవిశ్వాస యాత్ర” లలో భాగస్వామి అయిన రాచపాళెం, తన తండ్రి రామిరెడ్డి వ్యవసాయ జీవితం ఆధారంగా “పొలి” కావ్యం రాశారు. మే నెల వేసవిలో మొదలై, సెప్టెంబర్ నెలలో ముగిసే వరి సేద్యం ఈ కావ్యంలో వస్తువు. “పొలి” కావ్యంలో గొప్పదనం ఏమిటంటే వ్యవసాయం అంటే కేవలం భూమి కలిగిన రైతుదే కాదని, రైతు, వ్యవసాయ వృత్తుల వారు, వ్యవసాయ కూలీలు… ఈ మూడు వర్గాలు కలిస్తేనే వ్యవసాయం అవుతుంది అని కవి ప్రతిపాదించారు.
“ఐర్లండుకు చెందిన సేమన్ హీనె ‘కాలిపోయిన బతుకులోని అనుభూతి ద్వారాన్‌ని నిర్దేశించేదే కవిత్వం’ అంటారు. హీనె కవిత్వంలో గ్రామీణ అనుభూతులు, అనుభవాలు, రైతుల కథలు కళ్లకు కట్టినట్లు ఉంటాయి. “పొలి” కావ్యం కూడా హీనె రచనల్లాగే అంతర్గత సంక్షోభాన్ని కచ్చితంగా ఎత్తి చూపింది” – అన్నారు విజయా కోటేశ్వరరావు. నారు, చాడ, మడుపులు, నాట్లు, వొంచీలు, కలుపు, గంట, మూట, పొలి, గెనాలు, కక్‌కు, కోత, మేర, పరిగ, కల్లం వంటి కవిత ఖండికల శీర్షికలలోని గ్రామీణత్వమే, జానపదత్వమే కోటేశ్వరరావు అభిప్రాయం ఎంత వాస్తవికమైనదో తెలియజేస్తుంది. ఈ కావ్యంలో రైతు బడా భూస్వామి కాదు. ఒక మధ్యతరగతి రైతు. పంట చేతికొచ్చినాక కూడా అప్పు పెరిగే రైతు. పంట పండించే రైతు నష్టపోవడం, రైతు దగ్గర తక్కువ ధరకు కొని, సొమ్ము చేసుకునే దళారి సంపన్నుడు కావడం అనే ఒక దారుణవ్యవస్థ భారతీయ రైతును ఎలా ఛిద్రం చేస్తున్నదో “పొలి” కావ్యం పాఠకుల ముందు బొమ్మ కట్టిస్తుంది.
తిరుపతి గంగమ్మ జాతర సమయంలో రైతు వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసుకోవడంతో మొదలై, రైతు నష్టాల ఊబి నుంచి బయటపడి, వ్యవసాయం మానవీయంగా పునరుజ్జీవనంకావాలి అన్న ఆశతో ముగుస్తుంది. వ్యవసాయ కార్యకలాపాలను కవి గ్రామీణ, జానపద రూపకాలతో, పదచిత్రాలతో అలంకరించి ‘పొలి’ కావ్యాన్ని ఒక కొత్త సౌందర్య శాస్త్రంగా మలిచారు. కర్రుకు అటు ఇటు పడే కరుళ్ల చేతులతో/ నాగలికి స్వాగతం పలుకుతుంది. పొలాన్ని నాగలితో దున్నుతుంటే, నేల మట్టి చీలి, ఆ పెళ్లలు రెండు వైపులకు పడతాయి. ఆ దృశ్యం నేల నాగలికి స్వాగతం పలకడంగా భావించడం తెలుగు కవిత్వంలో కొత్త భావుకత.
ఆయిల్ ఇంజన్లు రాకముందు బావినీళ్లు తోడటానికి మోటతోలే వాళ్లు రైతులు. దానిని కొన్నిచోట్ల కపిల, కపిలె అని అంటారు. ఎద్దులకాడికి నీటిబానకు మధ్య ఒక మోకు కట్టి నీళ్లు చేదడం ‘మోట’ అనే ప్రక్రియ. దానికి చాలా సరంజామా – తోలు, గిలక, కదురు, మోకు – వంటివి ఏర్పాటు చేసుకోవాలి. బావిలో నీళ్లబాన ముంచి ఎద్దులను అదిలిస్తే, అవి మోకును లాగుతూ పోతే, నీటిబాన పైకి వస్తుంది. ఇదంతా ఒక సైన్సు. ఎద్దులు నీటి బానను పైకి లాగుతూ ముందుకు పోతుంటే మోట పరికరాలు శబ్దం చేస్తుంటాయి. దానికి కవి… ‘గిలకల శబ్దం, కదరు సవ్వడి/ మా నాయన పాట, అదొక పల్లెటూరి పాటకచేరి’ అన్నారు.
70 ఏళ్లు పైబడి, సేద్యంలో శ్రమించిన వాళ్లకే ఇలాంటి ఉపమలు స్ఫురిస్తాయి. ఇది న్ఙిడత.
‘ఒక బిడ్డను కనాలంటే/ తల్లెంత తిండి తినాలి!/ ఒక పంట పండాలంటే / నేల తల్లెంత తినాలి !’ ప్రకృతిని, మనిషిని ఇలా సమన్వయం చేయడం కృషీవలురకే చెల్లు. స్థానికంగా దొరికే ఆకు చెట్లు, అడవిలో దొరికే ఆకు చెట్లు – ఈ రెండు రకాల చెట్ల నుంచి రైతు ఆకును సేకరించి పొలంలో తొక్కుతాడు. ఈ ప్రక్రియ ‘దేశికీ విదేశికీ జత’ అంటాడు కవి.
“మెత్తగా దున్నిన కయ్యాల మీద / ఆకు పరవడం ఒకవిద్య/ ఆకుతొక్కడం ఒక కళ” బురదనేలలో ఆకు మండలు పరిచి, కాళ్లతో తొక్కేటప్పుడు, అది అయినాక మానుతోలుతూ పొలంలోని హెచ్చుతగ్గులను చదును చేస్తున్నప్పుడు కవి చేసిన వర’న ఆయన అనుభవం నుంచి దూసుకొచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే పొలి కావ్యానికి డా. పతికి రమేష్ నారాయణ (ద హార్వెస్ట్) పేరుతో చేసిన అనువాదానికి ముందుమాట రాసిన ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి “ఒక రకంగా ఇదొక స్మృతికావ్యం. ఒక వ్యవసాయ ఎలిజీ. గత స్మరణ కాకుండా వర్తమానపు దుస్థితిని పొలిలో ఆయన కళ్లకు కట్టడం వల్ల పాఠకుడు ఈ కావ్యాల్లో నిమగ్నం అవుతాడు” అన్నారు.
నేతగిరి పల్లి ఆడోళ్లు/ దారం పోగులతో చీరలే కాదు/ వరి మొలకలతో పొలాలనూ నేస్తారు/ వాళ్లు నాటిన వరిమళ్లు / రంగులద్దిన చీరలయ్యేవి. శ్రామిక వృత్తులన్నిటినీ వ్యవసాయానికి అన్వయించడం రాచపాళెం సమన్వయ స్వభావంలో విశేషమైన అంశం. పొలంలో కయ్యలకు గెనాలు వేయడం, గెనాలకు దళ వెయ్యడం, దళకు రెండు అడుగుల దూరంలో వొంచిలు వొంచడం – ఇది వరి పైరులో ఒక సాంకేతిక క్రియ. ఒక వ్యవసాయ శాస్త్రం. కవి ఈ ప్రక్రియను స్వయం సమృద్ధ వ్యవస్థతో సమన్వయం చేశారు.
వరిపైరు నాటిన తర్వాత, మొలకలు నిటారుగా నిలుచున్న తర్వాత, కొంగలు ఎర్రలకోసం వచ్చి వాలుతాయి. నిటారుగా నిలబడిన వరి మొలకలను తొక్‌కి పారేస్తాయి. అది రైతుకు నష్టం. ఈ స్థితిని కవి… ‘పాపం వాటికేమి తెలుసు / ఆ మొక్కలు రైతు నెత్తురు చుక్కలని’ అంటూ అటు కొంగల మీద, ఇటు రైతు మీద సానుభూతి చూపుతాడు. వ్యవసాయ చిత్రణ చేస్తూ చేస్తూ కవి, హఠాత్తుగా పొలంలోంచి సమాజంలోకి వచ్చి వర్తమానాన్ని వ్యాఖ్యానించడం ‘పొలి’ కావ్యంలో ఒక విశిష్టగుణం. వరి పొలంలో కలుపు తీయడం ఒక దశ, ఒక ప్రక్రియ. ఆ కలుపు తీయడాన్ని… ‘పైరులోనయినా/ ప్రజలలోనయినా/ కలుపు మొక్కల్ని పీకేయాల్సిందే…’ అని వ్యాఖ్యానించాడు కవి. ఇది ఈ కావ్యానికి మంచి సామాజిక విలువను సంపాదించి పెట్టింది. అలాగే రైతులు పొలంలో కష్టపడి తిండి గింజలు పండిస్తుంటే, నేతలు అవినీతిలో కూరుకుపోవడంలోని అనైతికతను కవి అధిక్షేపించాడు.
వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయాయి. 1990 నాటికి పాలకులు ప్రపంచీకరణకు తలలు వంచి, తమకు ఓట్లేసిన ప్రజలకు దూరం కావడం మొదలైంది. అందులో రైతుల మీద పెద్దదెబ్బ పడింది. ప్రపంచీకరణ ప్రవేశం మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లయింది. రైతు విషయంలో ఈ దుస్థితిని చెబుతూ…‘ఈ ఎరువుల బరువులమోతే/ చెట్టంత మానాయన్ని/ పిడికెడంత మనిషిని చేసింది’ అంటాడు. పాఠకులకు గగుర్పాటు కలిగించే మాట ఇది.
వరి పంటకు వచ్చే రోగాలకు పొలి చల్లడం ప్రాచీన ప్రక్రియ. పొట్టేలు లేదా మేకపోతు రక్తంలో ఉడికిన అన్నం, వేపాకు, పసుపు కలిపి పైరు మీద చల్లడం పురాతనమైన అలవాటు. ఈ ప్రక్రియను ఆధారం చేసుకుని రాచపాళెం సామాజికంగా చేసిన వ్యాఖ్య ఇది. ‘ఒక ప్రాణి కోసం మరో ప్రాణి/ ఒక జాతికోసం మరోజాతి/ రక్తం చిందించందే / యుద్ధం సంపూర్ణం కాదా?’
ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు కవి భావుకత, ప్రతిభ ఎంత విస్తృతమైనవోననిపిస్తుంది. 21వ శతాబ్దం వచ్చేసరికి పచ్చని గ్రామాలు రాజకీయ కుంపట్లయిపోయాయి. కుల, వర్గ రాజకీయాలతో ఐక్యత దెబ్బ తినింది. ఈ వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని కవి ‘పొలి’ ప్రక్రియను ఇలా నిర్వచించాడు. ప్రజలలో ఎన్ని చీలికలున్నా అవసరం కోసం ఎప్పుడో ఏకం కాక తప్పదు. ఈ సందర్భాన్ని కవి… ‘ధైర్యమున్నపుడు ఊళ్లో ఎవడికి వాడే/ రాజకీయాలొచ్చినప్పుడు రచ్చలు రంపులు/ భయం కలిగినప్పుడు అంతా ఒక్కటే/ భయానికి కులమేది? మతం ఏది?/ పైరుకు రోగం రైతును భయపెట్టే పులి/ పొలి గ్రామైక్యతాశిల్పాన్ని చెక్కే ఉలి’ అని శిల్పకళను సమన్వయం చేశారు.
‘పొలి’ కావ్యం శాస్త్ర, కళల సమన్వయ రూపం. సేద్యం, చరిత్రల సమన్వయ రూపం. గత వర్తమానాల మధ్య ప్రయాణం. ‘పొలి’ సానుభూతి కావ్యం కాదు, స్వానుభవ కావ్యం. ‘అంతా మాట్లాడటం మానేశాక కవి నిదానంగానైనా మాట్లాడుతున్నాడు. తన అనుభవాల నుంచి మాట్లాడుతున్నాడు. రైతు మాట్లాడకపోతే ఈ దేశం నిశ్శబ్దమైపోతుందనే స్పృహతో మాట్లాడుతున్నాడు’ -అన్నారు అరసవిల్లి కృష్ణ.
గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, 95423 22669

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు