Homeపల్లె ప్రగతి తిరోగమనం

పల్లె ప్రగతి తిరోగమనం

- Advertisement -

. పన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం
. పేరుకున్న బకాయిలు
. ఆదాయం లేక కుంటుపడిన గ్రామాభివృద్ధి

విశాలాంధ్ర-సచివాలయం: పల్లెల్లో పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీలుండగా…దాదాపు సగం పంచా యతీల్లో పన్ను బకాయిలు భారీగానే పేరుకు పోయాయి. ప్రభుత్వం పన్ను వసూళ్లకు మెరుగైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మారలేదు. పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో పాటు పంచాయతీలకు రావాల్సిన ఆదాయం సకాలంలో రాకపోవడం వల్ల రహదారులు, తాగునీరు, విద్యుత్‌ దీపాలు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాల పనులు నిలిచిపోతున్నాయి. పంచాయతీ సిబ్బంది వసూళ్లలో చురుకుదనం చూపకపోవడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చిందనే విమర్శలున్నాయి. గత మూడు, నాలుగేళ్లుగా పన్నుల వసూళ్లు సక్ర మంగా జరగలేదని అధికారులే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్‌ నాటికి ఉన్న గణాంకాలు పరిశీలిస్తే మొత్తం పన్నుల డిమాండ్‌ 907.71 కోట్లకు కేవలం రూ.5.35 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. బకాయిలు రూ.902 .36 కోట్లకు చేరాయి. పన్ను వసూళ్లలో తూర్పు గోదావరి జిల్లా చాలా వెనుకబడి ఉంది. రూ.83.18 కోట్లకుగాను కేవలం 0.59 కోట్లు మాత్రమే ఖజనాకు చేరింది. కాకినాడలో రూ.70.01 కోట్లకు రూ.0.53 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.61.35 కోట్లకు రూ. 0.29 కోట్లు, ఏలూరులో రూ.53.16 కోట్లకు రూ. 0.12 కోట్లు, గుంటూరులో రూ.45.46 కోట్లకు రూ. 0.09 కోట్లు మాత్రమే వసూలు చేశారు. అత్యధికంగా పన్ను వసూళ్లు చేసిన జిల్లాగా నెల్లూరు నిలిచింది. ఇక్కడ రూ.42.16 కోట్ల డిమాండ్‌కు గాను రూ.1.10 కోట్లు వసూలైంది. 2023-24లో రూ.962. 84 కోట్లకుగాను కేవలం 611.85 కోట్లు మాత్రమే వసూలైంది. సాధారణ పన్నులకు సంబంధించి మొత్తం డిమాండ్‌ రూ. 728.06 కోట్లు కాగా, వసూళ్లు రూ.470.96 కోట్లు. దాదాపు 35 శాతం బకాయిల రూపంలోనే ఉన్నాయి. పన్నుయేతర వసూళ్లు రూ.234.785 కోట్లకు గాను రూ.140.96 కోట్లు వసూల య్యాయి. గతంతో పోలిస్తే 2024-25 వసూళ్లు కొంత ఆశాజనకంగానే ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిమాండ్‌ రూ.1082.93 కోట్లు కాగా, వసూళ్లు రూ.819.25 కోట్లు జరిగాయి. ఇది మొత్తం డిమాండ్‌ లో 75.65 శాతంగా ఉంది. పన్నులకు సంబంధించి రూ.833.02 కోట్లగాను రూ.635.39 కోట్లు వసూళ్లు అయ్యాయి. అంటే 76.19 శాతం వసూళ్లు జరిగాయి. పన్నుయేతర వసూళ్లు రూ.249.91 కోట్లకు రూ.183.86 కోట్లు వసూలైంది. గతంతో పోలిస్తే 34 శాతం పెరుగుదల నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్స రానికి బకాయిలతో సహా మొత్తం పన్ను, పన్నేతర వసూళ్ల మొత్తం రూ.1200 కోట్లు లక్ష్యంగా ఉంది. లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదాయం లేకుండా గ్రామాభి వృద్ధి అసాధ్యం. ప్రతిపంచాయతీ పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు