Homeవ్యాపారంబెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద అమెజాన్ కార్యాలయం

బెంగళూరులో ఆసియాలోనే రెండవ అతిపెద్ద అమెజాన్ కార్యాలయం

- Advertisement -

బెంగళూరు: ఆసియాలోనే తమ రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించినట్లు అమెజాన్ సోమవారం ప్రకటించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, 12 అంతస్తుల్లో నిర్మించిన ఈ క్యాంపస్.. ఈకామర్స్, ఆపరేషన్స్, పేమెంట్స్, టెక్నాలజీ, సెల్లర్ సర్వీసెస్ (విక్రేతల సేవలు) వంటి వివిధ విభాగాలకు చెందిన 7,000 మందికి పైగా ఉద్యోగులకు వసతి కల్పిస్తుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, ఐదు bకరాల స్థలంలో నిర్మించిన ఈ కార్పొరేట్ భవనాన్ని.. కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివద్ధి శాఖ మంత్రి డాక్టర్ bం.బి. పాటిల్ అధికారికంగా ప్రారంభించారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఒకేచోట కలిసి పనిచేసేలా, సౌకర్యవంతంగా ఉండేలా, మరియు వారి శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్పొరేట్ భవనాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించారు. భారతదేశంలో అమెజాన్ నిరంతరం చేస్తున్న పెట్టుబడులలో భాగంగానే ఈ కొత్త క్యాంపస్ ప్రారంభించబడింది. సంస్థ ఇప్పటికే భారతదేశంలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 2030 నాటికి దేశంలో అదనంగా మరో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల, మౌలిక సదుపాయాల అభివద్ధి శాఖ మంత్రి డాక్టర్ bం.బి. పాటిల్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు