- Advertisement -
నేను నిన్ను విడిచి దూరంగా వచ్చేశాను
దేశ బహిష్కరణ శిక్ష పొందిన వాడిలా
ఎందుకంటే కాలంతో
ఏరకమైన గొడవా లేదు
దూరం, నిస్సహాయత కలుసుకుంటూ
ఎవరో చిన్నపిల్లాడు
ఇల్లూ వాకిలీ విడిచిపెట్టి
జనపడానికి వెళ్లి అక్కడి నుంచి రాజధానిలో
ఒక్కడూ తిరుగుతూ
కిందపడి దెబ్బ తగిలినా
లో లోపలే ఏడ్చుకుంటున్నట్లు
దూర దేశంలో
అచ్చంగా అలాగే
నేను కూడ బహిష్కరణతో బాధ
అనుభవిస్తున్నాను
బాధ పడుతున్నాను
మొట్టమొదటిసారి తెలిసింది
నియతి లేక ఎవరైనా దేశ బహిష్కరణ చేస్తే
బహిష్కరించలేము
దేశాన్ని
మనసు యొక్క
అంతరంగం నుంచి.
హిందీమÖలం: కైలాశ్ వాజపేsTÖ
తెలుగు అనువాదం: పారనంది నిర్మల
సెల్: 9985103804


