Homeవాస్తవాల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే…

వాస్తవాల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే…

- Advertisement -

. సమాధానం చెప్పకుండా మోదీ పారిపోయారు
. స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని ముఖం చాటేశారు
. ప్రతిపక్షాల ఆగ్రహం
. ప్రధాని ప్రసంగించకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం
. లోక్‌సభలో అనూహ్య పరిణామం – రాజ్యసభలోనూ దుమారం

న్యూదిల్లీ: ప్రధాని మోదీకి నిజాలంటే భయం…అబద్ధాలే శరణ్యంగా భావిస్తారని ప్రతిపక్షాలు చురకలు అంటించాయి. వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే లోక్‌సభ నుంచి ముఖం చాటేశారని విమర్శించాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదు. ఆయన ప్రసంగం లేకుండానే ఈ తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఇలా 22 ఏళ్లలో మొదటిసారి జరిగింది. తీర్మానానికి ప్రతిపక్షాలు సూచించిన సవరణలు కూడా జరగలేదు. ఇందుకోసం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు కానీ మెజార్టీ రాకపోవడంతో సవరణలను సభ తిరస్కరించింది. స్పీకర్ అనంతరం ధన్యవాద తీర్మానాన్ని సభ్యులకు చదివి వినిపించారు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసన నడుమ మూజువాణీ ఓటుతో ధన్యవాద తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. ఇది జరిగినప్ప్పుడు మోదీ లోక్‌సభలో లేరు. ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని బుధవారమే మాట్లాడాలి కానీ ప్రతిపక్షాల నిరసనలతో అది కుదరలేదు. ప్రధాని గురువారం ప్రసంగిస్తారని అనుకుంటే తానే స్వయంగా మోదీని సభకు రావద్దని చెప్పినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ప్రతిపక్షాలు ఏదో కుట్ర చేశాయని, అందుకోసమే రావద్దని చెప్పానని ఆరోపించారు. ముందు రోజు మహిళా ఎంపీలు కొందరు ప్రధాని స్థానాన్ని ముట్టడించిన క్రమంలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ వెనుక నక్కి వాస్తవాల నుంచి మోదీ ముఖం చాటేశారని విమర్శించారు. నిజాలు మాట్లాడే ధైర్యం లేక ప్రసంగం నుంచి తప్పించుకున్నారని దుయ్యబట్టారు. వేర్వేరు కారణాలతో ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించడంలో లోక్‌సభ తొలుత 2 గంటల వరకు… ఆపై 3 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత కూడా కొనసాగిన విపక్షాల నిరసనలతో సభకు కొన్నిసార్లు అంతరాయం కలిగింది. అయితే లోక్‌సభ పరిణామాల ప్రభావం రాజ్యసభలోనూ కనిపించింది. పెద్ద సభ కూడా ప్రతిపక్షాల నిరసనలతో దద్దరిల్లింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖడ్గే గళమెత్తారు. పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ… కానీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అనుమతి లేదని వ్యాఖ్యానిం చారు. ఇదే క్రమంలో అధికార పక్ష నాయకుడు జేపీ నడ్డాతో ఆయనకు వాగ్వాదం జరిగింది. సభలో గందరగోళం నెలకొంది. అధికార పక్షాన్ని ఆక్షేపిస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తణమూల్, డీఎంకే, వామపక్షాలపై విమర్శలు గుప్పించారు. మోదీ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. తొలుత ప్రధాని మాట్లాడేందుకు నిలబడినప్ప్పుడు… ఖడ్గేకు మాట్లాడే అనుమతివ్వాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు కానీ, చైర్మన్ సీపీ రాధాకష్ణన్ ఒప్ప్పుకోలేదు. దీంతో ప్రధాని ప్రసంగం మొదలైన వెంటనే ‘ఎలఓపీని మాట్లాడనివ్వండి’, ‘అనుమానాలను సహించం’ ‘నిరంకుశత్వాన్ని ఉపేక్షించం’ అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలిచ్చారు. నిరసన నడుమ ప్రసంగాన్ని కొనసాగించిన మోదీ… ఖడ్గేనుద్దేశించి ‘మీ వయస్సు దష్ట్యా నినాదాలు మాని కూర్చోండి’ అని వ్యాఖ్యానించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనగా వాకౌట్ చేశారు.
రాజ్యసభ ఎంపీల ధర్నా
మోదీ ప్రసంగం సమయంలో రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు మకర ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడికి గౌరవమే లేదని అసహనం వ్యక్తంచేశారు. మరే ప్రజాస్వామ్యంలో ఇలా జరగదన్నారు. మల్లికార్జున ఖడ్గే విలేకరులతో మాట్లాడుతూ చట్ట సభల్లో ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే అనుమతి లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి రెండు మూల స్తంభాలు లోక్‌సభ, రాజ్యసభ. అందులో ఒకటి నాశనం చేసి… మరొక చోట మాట్లాడలేరు’ అని లోక్‌సభలో ప్రసంగించకుండా రాజ్యసభలో మోదీ మాట్లాడటాన్ని ఉద్దేశించి ఖడ్గే అన్నారు. ‘మా నిరసన తెలియజేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు ఖడ్గేను రెండు నిమిషాలు మాట్లాడనివ్వమని ప్రతిపక్ష సభ్యులు కోరితే చైర్మన్ అనుమతి ఇవ్వలేద’ని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ మండిపడ్డారు. ఎక్కడైనాగానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాని తరహా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నత స్థానం ఉంటుందని, ఆయన ఆలోచనలు, సలహాలకు విలువ ఇస్తారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు