Homeక్రీడలువైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలి

వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలి

- Advertisement -

బీసీసీఐకి ఇర్ఫాన్ పఠాన్ సూచన

న్యూదిల్లీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జాతీయజట్టులోకి తీసుకునే సమయం ఆసన్నమైందని భారత్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతడు 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇ వైభవ్‌ని జాతీయజట్టుకు ఎంపిక చేయడంలో ఎదురుచూడాల్సిన అవసరం లేదంటూ ఇర్ఫాన్ బీసీసీఐకి సూచించాడు. సూర్యవంశీ ఓ యువ సంచలనంమని…15 ఏళ్ల వయసులో వైట్‌బాల్ క్రికెట్‌లో ఇలాంటి ప్రదర్శన మరెక్కడా చూడలేమని తెలిపాడు. ‘నేను గత సంవత్సరం బుమ్రా బౌలింగ్‌లో ఔట్ అయ్యాను. ఇప్పుడు అతడి బౌలింగ్‌లో నేను ఎక్కువ స్కోర్ చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మ్యాచ్‌కు ముందు సూర్యవంశీ చెప్పాడు. చెప్పిందే చేసి చూపించాడు. ‘వైట్‌బాల్ క్రికెట్‌లో బుమ్రాని ఎదుర్కోవడం కష్టం. కానీ సూర్యవంశీ ఇప్పుడు ఆ గోల్‌ని రీచ్ అయ్యాడు. కాబట్టి ఈ కుర్రాడిని ఎక్కువకాలం వేచి ఉంచాల్సిన అవసరం లేదు. టీమ్ ఇండియాలోకి తీసుకోవడం ఉత్తమం. ఇలా అయితే అతడు 20 ఏళ్ల పాటు వృత్తిలో కొనసాగగలడు’ అంటూ ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచుల్లో సూర్యవంశీ రాణిస్తున్నాడు. ఇటీవల సీఎస్‌కేపై 17 బంతుల్లో 52 పరుగులు చేసి సత్తా చాటాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు