Homeవ్యాపారంశామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ ఆధ్వర్యంలో 3వ స్టార్టప్‌ సమ్మిట్‌ సక్సెస్‌

శామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ ఆధ్వర్యంలో 3వ స్టార్టప్‌ సమ్మిట్‌ సక్సెస్‌

- Advertisement -

గురుగ్రామ్‌: శామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ ఇన్‌స్టిట్యూట్‌, నోయిడా (ఎస్‌ఆర్‌ఐ-నోయిడా) తన మూడవ స్టార్టప్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ డైనమిక్‌ ఈవెంట్‌ విఘాతకర సాంకేతికతను ప్రదర్శించేందుకు, ప్రభావవంతమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు మరియు భవిష్యత్తు ఆవిష్కరణలపై చర్చలకు ప్రేరణనివ్వడమే లక్ష్యంగా నిర్వహించబడిరది. ఆరోగ్య సంరక్షణ, లాంగ్వేజ్‌ మోడల్‌లు, ఆడియో డీప్‌ ఫేక్‌ డిటెక్షన్‌, ఎక్స్టెండెడ్‌ రియాలిటీ (ఎక్స్‌ఆర్‌)లలో అత్యాధునిక పురోగతులపై దృష్టి సారించి, తాజా ఎడిషన్‌ ఏఐ-ఫస్ట్‌ స్టార్టప్‌లు, గ్లోబల్‌ టెక్‌ లీడర్లను ఒకచోట చేర్చింది. క్రాస్‌-ఫంక్షనల్‌ సహకారం ద్వారా నైతిక ఏఐ, డిజిటల్‌ ట్రస్ట్‌, తదుపరి తరం ఆవిష్కరణల క్లిష్టమైన అవసరాన్ని సమ్మిట్‌ హైలైట్‌ చేసింది. బలమైన సాంకేతిక భాగస్వామ్యాలు, క్రాస్‌-ఇండస్ట్రీ సహకారం, ప్రతిభను వేగవంతం చేయడం ద్వారా ఆవిష్కరణ వ్యవస్థను బలోపేతం చేయడమే శామ్‌సంగ్‌ లక్ష్యం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు