జులై 20 నుంచి 25 దాకా దిల్లీలోనూ, దేశంలోని వివిధ రాష్ట్రాలలో నీట్ పరీక్షలకు అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వారి మీద దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్.లు అన్నింటినీ సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఉద్యమం జరిగిన తరవాత కాక్రోచ్ జనతా పార్టీతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చిన మూడు హామీలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయనందు వల్ల వచ్చే శనివారం తలపెట్టిన ఇండియా గేట్ దాకా నిరసన జరపాలన్న ప్రతిపాదనను కాక్రోచ్ జనతా పార్టీ ఉపసంహరించింది. ఈ ఉద్యమంతో సంబంధం ఉన్న వారి నివేదించబోమని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఇది ఇంతవరకు రెండు వైపుల ఉన్న స్పరœలను, అనుమానాలను తొలగించడానికి ఈ ఎఫ్.ఐ.ఆర్.లు రద్దు చేస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్ మాల్యా బాగ్చీ, ఎ.మోహనతో కూడిన బెంచి తీర్పు ప్రకటించింది. అలాగే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన తరవాత ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే దీనికి కావాల్సిన విధి విధానాలను రూపొందించి, ఉత్తర్వులు జారీ చేయడానికి మూడు నెలల సమయం అవసరం అని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థనను కోర్టు అనుమతించింది. ఈ పరిహారం చెల్లించడానికి స్పష్టమైన విధానం రూపొందించాల్సి ఉంటుంది. ఎఫ్.ఐ.ఆర్.ల విషయంలో నాలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.లను కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.సుభాష్ రెడ్డి నాయకత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన ఓ ఉన్నతాధికార కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఉద్యమ విషయంలో పరస్పర ఆరోపణలలో గల వివాదాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద ఉన్న విశిష్ట అధికారాలను వినియోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. నీట్ పరీక్షలలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నవారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి కూడా వీలు లేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. అలాగే ఈ ఉద్యమానికి సంబంధించి ఆ తరవాత ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేయడానికి కూడా వీలు లేదని సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే ఈ ఉద్యమంలో కరడుగట్టిన రౌడీషీటర్లు, మరి కొంతమంది మొత్తం మాజీ న్యాయమూర్తి ఆర్.సుభాష్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే పేర అత్యుత్సాహం ప్రదర్శించి చట్ట వ్యతిరేకంగా బలప్రయోగానికి దిగడం, లాఠీచార్జీ చేయడం, పెల్లెట్ గన్స్ ఉపయోగించడం లాంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది. నిరసన తెలియజేసిన మహిళల విషయంలో పోలీసుల దాష్టీకాన్ని కూడా ఈ కమిటీ బేరీజు వేసింది. ఈ కమిటీ నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తుంది. జులై 20 ఆ తరవాత జరిగిన ఆందోళనలో నిరసనకు దిగిన వారు తమ మీద హింసాత్మక దాడులకు పాల్పడ్డారని పోలీసులు కూడా వాదిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. అయితే పోలీసులు జులై 20 ఉద్యమంలో పాల్గొన్న 2,837 మంది హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, వారిలో నేర చరిత్ర ఉన్న వారు ఉన్నారని ప్రభుత్వం భావించింది.
ఇలాంటి కేసులలో చట్టం ప్రకారం వ్యవహరించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. మంగళవారం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రభావం ఏమిటంటే ఎఫ్.ఐ.ఆర్.లన్నీ రద్దవుతాయి. కొత్త ఎఫ్.ఐ.ఆర్.లు ఏవీ దాఖలు చేయడానికి వీలు ఉండదు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ సహసమన్వయకర్త సౌరవ్ దాస్ కోర్టులోనే ఉన్నారు. ఆయన కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఓ లిఖిత ప్రకటన చదివి వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు సానుకూలంగా ఉన్నందువల్ల వచ్చే శనివారం తాము తలపెట్టిన ఇండియా గేట్ దాకా నిరసన ప్రదర్శనను విరమించుకుంటున్నామని ఉంది. సానుకూలమైన తీర్పు వెలువరించినందుకు ఆయన సుప్రీంకోర్టుకు, రెండు పక్షాల న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న మరో విశేషం ఏమిటంటే అసంతృప్తి తెలియజేయడం, నిరసనకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఉన్న హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవ సమస్యలు, అంశాలపై నిరసన చేయడానికి ప్రజలకు ఉన్న రాజ్యాంగ విహితమైన హక్కును కోర్టు మరోసారి గుర్తు చేసింది. అయితే ఈ నిరసనలు, ఆందోళనల్లో హింసాత్మక విధానాలు అనుసరించకూడదని కూడా స్పష్టం చేసింది. నీట్, తదితర పోటీ పరీక్షలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై జూన్‌లో ఆందోళన ప్రారంభం అయింది. పరీక్షా పత్రాలు ముందే బయటపడడానికి వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తిన తరవాత పర్యావరణ పరిరక్షకుడు సోనం వాంగ్‌చుక్ జంతర్‌మంతర్‌లో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. మరో 20 మంది కూడా నిరసన వ్రతం పూనారు. సోనం వాంగ్చుక్ను ప్రభుత్వం జంతర్‌మంతర్ నుంచి తొలగించి ఆసుపత్రిలో చేర్పించింది. అయినా తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆయన ప్రకటించారు. వైపరీత్యం ఏమిటంటే చివరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు జె.పి.నడ్డా, ప్రధాన మంత్రి కార్యాలయంలో పని చేసే కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్ ఇచ్చిన పళ్ల రసం తాగి వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించారు. ఈ వ్యవహారంలో గమనించవలసిన మరో అంశం ఏమిటంటే ఆగస్టు 3వ తేదీన వివిధ రాష్ట్రాలలో ఉద్యమకారులపై దాఖలు చేసిన కేసుల విషయంలో ఆయా ప్రభుత్వాలు చట్ట ప్రకారం వ్యవహరించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ ఉత్తర్వును కూడా పక్కన పెట్టి నీట్ పరీక్షా పత్రాల లీక్‌కు సంబంధించిన ఉద్యమంలో పాల్గొన్న వారందరిపై ఎఫ్.ఐ.ఆర్.లను ఉపసంహరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ చరిత్ర ఉన్న నిరసనకారులపై చర్య తీసుకునేటప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించొచ్చునని సూచించింది.
సకల ఎఫ్.ఐ.ఆర్.లు రద్దు
- Advertisement -


