Saturday, February 22, 2025
Homeసమష్టిగా ముందుకెళదాం

సమష్టిగా ముందుకెళదాం

అన్ని ఎన్నికల్లో గెలుపు మనదే
ఎన్‌డీఏ సమావేశంలో మోదీ

న్యూదిల్లీ: దిల్లీలో గెలుపుతో ఎన్‌డీఏ పక్షాలు విజయోత్సవంతో ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. మరింత బలంగా ముందుకెళ్లాలని సంకల్పించాయి. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రతినిధులతో గురువారం జరిగిన ఎన్‌డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే విలేకరులకు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం, దేశ అభ్యున్నతి కోసం పటిష్ఠ కార్యాచరణతో ముందుకెళ్లాలని కేంద్ర`రాష్ట్ర ఎన్‌డీఏ ప్రభుత్వాలకు మోదీ సూచించినట్లు తావ్డే చెప్పారు. దిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికిగాను దేశ రాజధానికి ఎన్‌డీఏ నాయకులు చేరుకున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. సమావేశానికి మోదీ, అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిల్లీ సీఎం ప్రమాణ స్వీకారా నికి, ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వాల పనితీరు గురించి ప్రధాని మోదీ అందరినీ అడిగి తెలుసుకు న్నారు. దిల్లీ సీఎం రేఖాగుప్తా, డిప్యూటీ సీఎం పర్వేశ్‌ వర్మ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కొత్తగా సీఎం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ ఇద్దరినీ ఎన్డీయే పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు అభినందించారు. ఆ తర్వాత నడ్డా, మోదీ మాట్లాడారు. అభివృద్ధి అజెండాపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో మోదీ ప్రత్యే కంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏపీలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి పనుల స్థితిగ తులను మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని విధాలా తోడ్పాటు ఉంటుం దని చెప్పగా… చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం. ఓవైపు ఏపీలో కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా ఈ విమర్శలకు మోదీ చెక్‌ పెట్టినట్లు తెలుస్తోంది. వేదికపై పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు