విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు బుధవారం విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి పండుగ సమయంలో నాటి మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముకున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేసి… విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ కేసుతోపాటు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన మరో కేసు, రెండు పీటీ వారెంట్ కేసుýలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులతో జనవరి 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంబటికి బెయిల్ మంజూరు కావడంతో 19 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి విడుదల సందర్భంగా వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలివచ్చి… ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అంబటి రాంబాబువిడుదల
- Advertisement -
RELATED ARTICLES


