Homeవిశ్లేషణఅన్నదాత మెడకు ఉచ్చు!

అన్నదాత మెడకు ఉచ్చు!

- Advertisement -

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగంపై మరోసారి తీవ్రమైన దాడి జరుగుతోంది. దేశ సార్వభౌమాధికారాన్ని, కోట్ల మంది రైతుల భవితవ్యాన్ని పణంగా పెడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకోబోతున్న తుది వాణిజ్య ఒప్పందం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ రైతు బతికే హక్కునే హరించేస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం మరోసారి మూర‰ంగా ముందుకు పోతోంది. జూలై 2026 చివరి వారంలో సంతకాలు జరగనున్న ఈ ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) డిమాండ్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియమూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలన్న వారి డిమాండ్ పూర్తిగా సమంజసమైనది. రాజ్యాంగబద్ధంగా వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. కానీ, ఈ ఒప్పంద చర్చల ఏ దశలోనూ రాష్ట్ర ప్రభుత్వాలను గానీ, కనీసం ప్రజాప్రతినిధులను గానీ కేంద్రం సంప్రదించలేదన్నది వాస్తవం. వ్యవసాయం, పాడి పరిశ్రమ, సేవలు, డిజిటల్ వాణిజ్యానికి సంబంధించి పార్లమెంటుకు కూడా ఎలాంటి అర్థవంతమైన సమాచారం ఇవ్వకుండా మొత్తం ప్రక్రియను ఒక రహస్య గోడ వెనుక దాచిపెట్టడం అత్యంత అప్రజాస్వామికం. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడిన సుమారు 80 కోట్ల మంది ప్రజల జీవితాలను, వారి భవిష్యత్తును తాకట్టు పెడుతూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం. పార్లమెంటు వేదికగా మంత్రి పియమూష్ గోయల్ దేశ ప్రజలను, రైతాంగాన్ని పదేపదే తప్పదోవ పట్టించారని స్పష్టంగా తెలుస్తోంది.అమెరికాతో వాణిజ్య ఒప్పందం వ్యవసాయ, పాడి రంగాల ప్రాథమిక ప్రయోజనాలను ‘పూర్తిగా’ రక్షిస్తుందని కేంద్ర మంత్రి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని ఫిబ్రవరి 6, 2026న కుదిరిన మధ్యంతర ముసాయిదా (ఇంటీరియమ్) ఒప్పందంతో తేటతెల్లమైంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాకు చెందిన సోయాబీన్ నూనె, పశుగ్రాసం (డీడీజీఎస్), జొన్నలు, డై ఫ్రూట్స్‌, పండ్లు, వైన్, స్పిరిట్స్‌ తదితర ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ తలుపులు బార్లా తెరిచారు. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు పాడి ఉత్పత్తులు, ఇంధనం, బొగ్గు, సమాచార సాంకేతికత రంగాలకు చెందిన దాదాపు 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.40 లక్షల కోట్లు) విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా భారతదేశాన్ని ఈ ఒప్పందం ఉచ్చులో బిగించింది. ఇది దేశంలోని 86 శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని నాశనం చేసే కుట్ర కాక మరేమిటి ? ఈ ఒప్పందం జన్యుమార్పిడి (జీఈ) ఆహారం, విత్తనాలకు తలుపులు తెరవడమే కాకుండా, అమెరికాలో భారీగా సబ్సిడీలు పొందుతున్న గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పాల ఉత్పత్తులు మన దేశంలోకి విచ్చలవిడిగా ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తోంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏల) దుష్రÎభావం కేవలం భవిష్యత్ అంచనాలకే పరిమితం కాలేదు, అప్పుడే క్షేత్రస్థాయిలో రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఉదాహరణకు, 2025 ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య పత్తిపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో, దిగుమతులు అమాంతం పెరిగిపోయాయి. కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం, క్రితం ఏడాది 41 లక్షల బేళ్లుగా ఉన్న పత్తి దిగుమతులు 202526 నాటికి 50 లక్షల బేళ్లకు చేరాయి. ఫలితంగా డిసెంబర్ 2025 నాటికి దేశీయ మార్కెట్‌లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.6,000 నుంచి రూ.7,000కు పడిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,710 కాగా, రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. సోయాబీన్ పరిస్థితి కూడా ఇంతే. అక్టోబర్ 2025లో సోయాబీన్ సగటు ధర రూ.3,942 ఉండగా, అది మద్దతు ధర (రూ.5,328) కంటే దాదాపు 26 శాతం తక్కువ. ఇప్పుడు సున్నా దిగుమతి సుంకంతో అమెరికా ఉత్పత్తులు దేశంలోకి వస్తే 202627 నాటికి పత్తి, సోయాబీన్ రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారడం ఖాయం.
మరోవైపు, మన రాజ్యాంగం ప్రకటించిన దేశ సార్వభౌమాధికారం కోల్పోవడం వల్ల భారతీయులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. జూన్ 2026లో ఇరాన్ చమురును అడ్డుకునే క్రమంలో ఒమన్ సింధుశాఖలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా, కేంద్ర ప్రభుత్వం కనీసం గట్టిగా నిరసన కూడా తెలపకపోవడం దారుణం. అంతేకాకుండా, అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా, ఇరాన్‌ల నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడానికి అంగీకరించడం ద్వారా మన దేశ ఇంధన భద్రతను, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మోదీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఆర్‌ఎస్‌ఎస్ నేత రామ్ మాధవ్ స్వయంగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ఈ లొంగుబాటు విధానాన్ని బట్టబయలు చేశాయి. దీనిని ప్రభుత్వం ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’ (స్రాట్టజిక్ అటానమీ) అని ప్రచారం చేసుకుంటోంది గానీ, వాస్తవానికి ఇది వ్యూహాత్మక లొంగుబాటు మాత్రమే. కేవలం అమెరికాతో మాత్రమే కాకుండా బ్రిటన్, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, ఆస్రేట్లియా వంటి దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలన్నీ భారత వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టు లాంటివే. కార్పొరేట్ శక్తులకు భారతీయ మార్కెట్‌లను అప్పగించే ఈ విధానాలను అడ్డుకోకపోతే దేశంలో ఆహార భద్రతకే ముప్పు వాటిల్లుతుందనేది అక్షర సత్యం. రైతుల ఆదాయానికి ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఇటువంటి ఒప్పందాలు చేసుకోవడం దారుణం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సీ2G50 శాతం ఫార్ములాతో అన్ని పంటలకు లాభదాయకమైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించేలా కేంద్రం వెంటనే చట్టం చేయాలి, అలాగే సమగ్ర రుణమాఫీ అమలుచేయాలి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని, అలాగే ఇతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎలాంటి దాపరికాలు లేకుండా పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు ప్రతినిధుల ముందు ఉంచాలి. వ్యవసాయ రంగాన్ని, రైతుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ ఒప్పందాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, దేశంలో మరో రైతాంగ మోద్యమం, అగ్నిపర్వతంలా బద్దలవడం ఖాయం.2026 జూలై 22న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) దేశవ్యాప్త నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఆందోళనల ప్రధాన ఉద్దేశం భారత్అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని అడ్డుకోవడమే. 2026 జూలై చివరి వారంలో సంతకాలు జరగనున్న తుది భారత్అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలన్నది ప్రధాన డిమాండు. దీంతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, ఆస్రేట్లియా వంటి ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న రైతు వ్యతిరేక వాణిజ్య ఒప్పందాలకు (ఎఫ్‌టీఏల) వ్యతిరేకంగా రైతులందరినీ ఏకం చేయడం ఈ నిరసనల ముఖ్య ఉద్దేశం. అలాగే, వాణిజ్య ఒప్పందాల చర్చల గురించి పార్లమెంటును, రాష్ట్ర ప్రభుత్వాలను, రైతులను చీకట్‌లో ఉంచి మోసగించినందుకుగానూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియమూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలన్నది కూడా మరో డిమాండ్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సీ2G50 శాతం ఫార్ములా ఆధారంగా అన్ని పంటలకు లాభదాయకమైన కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) కల్పిస్తూ కేంద్రం వెంటనే ఒక చట్టం చేయాలని, దేశ వ్యాప్తంగా రైతులందరికీ సమగ్ర రుణమాఫీని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు