హోర్మూజ్ వద్ద వివాహ వేడుకపైకి క్షిపణులు…
తెహ్రాన్ ప్రతీకార దాడులు
తెహ్రాన్/న్యూయార్క్: చేసిన నేరాలకు శిక్ష తప్పబోదని అమెరికాకు ఇరాన్ తేల్చిచెప్పింది. హోర్మూజ్ జల సంధి వద్ద పౌరులపై దాడులతో ఆగ్రహం వ్యక్తంచేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెంచే విధంగా ఇరాన్‌పై అమెరికా తాజా దాడులు చేసింది. సిరిక్ కౌంటీలో వివాహ వేడక జరుగుతుండగా దాడి చేసి పౌర హత్యలకు పాల్పడింది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై క్షిపణి శకలాలు పడి ఓ చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. మానవ హక్కుల పరిరÅ£Œ”లమని చెప్పకునే వారి కపటత్వానికి ఈ ఘటన నిదర్శనమని వ్యాఖ్యానించింది. మినాబ్, లామెర్డ్లో హింసాత్మక సన్నివేశం మళ్లీ సిరిక్‌లో కనిపించిందని పేర్కొంది. హోర్మూజ్ జల సంధి కోస్తా ప్రాంతంలో సిరిక్ ఉన్నది. గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, మేరీటైమ్ ఆస్తులు, మైన్లు పరిచే సామర్థ్యాల, కమ్యూనికేషన్ కేంద్రాలు దెబ్బ తీసే విధంగా అమెరికా దాడులు చేసినట్లు ఎక్స్ మాధ్యమంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అనుకున్న లక్ష్యాలను తమ దళాలు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ దాడులలో చిన్నారి సహా అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఇరాన్ అత్యున్నత రాయబారి మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ మండిపడ్డారు. ‘అమెరికా ఓ సైతాను. ఈ దేశం తన శక్తిని ఓ సైతాను వలే వాడుకుంటోంది. సైతాను తరహా లక్ష్యాలు ఎంచుకుంటోంది. సైతాను పద్ధతిలో రక్తం చిందిస్తోంది. మరో చిన్న సైతాను కూడా అదే చేస్తోంది. అమెరికా ఓ పెద్ద సైతాను’ అని ఎక్స్‌లో అమెరికా, దాని మిత్రపక్షం ఇజ్రాయిల్‌పై గాలిబాఫ్ నిపðలు చెరిగారు. ఈ నేరాలకుగాను అమెరికా శిక్ష అనుభవించక తప్పబోదని ఇరాన్ పార్లమెంటులో జాతీయ భద్రతా, విదేశాంగ విధానం కమిటీ అధినేత ఇబ్రహీం అజీజి కూడా ఎక్స్ మాధ్యమంగా దుయ్యబట్టారు. ఇరాన్ సాయుధ దళాల నుంచి వారిని ఎవరూ కాపాడలేరన్నారు.
ఇరాన్ ప్రతీకార దాడులు
అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా ఆస్తులపై విరుచుకుపడింది. యూఏఈలోని అల్ దాఫ్రా, అల్ మిన్హాద్ వద్ద అమెరికా దళాల స్థావరాలు, రాడార్ వ్యవస్థలు లక్ష్యంగా పదుల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది. భీకరంగా ప్రతీకార దాడులు జరిగాయని పేర్కొంది. బహ్రెయిన్‌లో షేక్ ఈశా ఎయిర్ బేర్ వద్ద రాడార్ కేంద్రాలను దెబ్బతీసినట్లు తెలిపింది.
మొజ్తాబా ఖామేనీ హెచ్చరికలు
మర్చిపోలేని గుణపాఠం చెబుతామంటూ అమెరికాను ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ హెచ్చరించారు. ఇరాన్‌పై అసలు ఎందుకు దాడి చేశామంటూ అమెరికా తలబాదుకునే పరిస్థితిని తమ సాయుధ దళాలు కల్పిస్తాయన్నారు. హోర్మూజ్ పరిధి రవాణా మార్గాల్లో సీ మైన్స్ తొలగించినట్లు ప్రకటించిన అమెరికా… ఆ వెంటనే ఇరాన్ మళ్లీ సీ మైన్స్ పరిచేందుకు సిద్ధమైందని ఆరోపిస్తూ క్షిపణి దాడులు చేసింది. నెల రోజులుగా ఆగిన ఘర్షణలు తిరిగి మొదలయ్యే పరిస్థితి తెచ్చింది. దక్షిణ ఇరాన్‌తో పాటు హోర్మూజ్ వెంబడి దాడులు చేసింది. వివాహ వేడుకతో పాటు చాబహార్, కొనరాక్ ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో మొజ్తాబా ఆగ్రహం వ్యక్తంచేశారు. అనవసరంగా ఈ దాడులు చేశామని అమెరికా పశ్చాతాపం పడే రోజు రాబోతోందని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు.
కుప్పకూలిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ: ట్రంప్
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, హోర్మూజ్ జల సంధి దాదాపుగా తమ నియంత్రణలోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను బలవంతంగా చర్చలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ట్రూత్ సోషల్ మాధ్యమంగా తోసిపుచ్చారు. తనకు ఇరాన్‌ను చర్చలకు తీసుకు వచ్చే ఆసక్తి ఏ మాత్రం లేదని చెప్పారు. ఆ దేశం ఎంతో కాలం మనుగడ సాగించలేదన్నట్లుగా పోస్టుపెట్టారు.
ఇరాన్‌కు రష్యా సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెక్నాలజీ
ఇరాన్‌కు రష్యా రహస్యంగా సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లను అభివృద్ధి సహకరిస్తున్నట్లు తెలిసింది. సీ430ఎల్ పేరుతో ఈ మిషన్ చేపట్టినట్లు సమాచారం. రష్యన్ ఇంటెలిజెన్స్ నుంచి లీకైన సమాచారం ఆధారంగా అమెరికా యుద్ధ నౌకలను ఎదుర్కొనే విధంగా ఈ క్షిపణుల అభివృద్ధి జరుగుతున్నట్లు అంచనా వేశారు. 2023 నుంచి కార్యాచరణ కొనసాగుతోందని… రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టవ్ అభివృద్ధి జరుగుతోందని సమాచారం. ధ్వనికి మించిన వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణుల ఇంజిన్‌లను ఈ టెక్నాలజీతో తయారు చేయవచ్చని తెలుస్తోంది. రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఇరాన్ సొంతంగా తయారు చేసిందని, రష్యా ఆ సాంకేతికను అందించలేదన్న వాదన వినిపిస్తోంది.


