Friday, March 6, 2026
Homeసినిమాఆ సినిమా సమయంలోవిజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక

ఆ సినిమా సమయంలోవిజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక

- Advertisement -

హైదరాబాద్:కొంతమంది హీరో, హీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అలాంటి జాబితాలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ’ సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక ముందుంటారు. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవగా బుధవారం వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. అసలు తొలిసారి విజయ్‌ను చూసి రష్మిక భయపడ్డారట. గతంలో ఇదే విషయాన్ని ఆమె పంచుకున్నారు. ‘కొత్త వ్యక్తులతో మాట్లాడటమంటే కాస్త బెరుకు. అందుకే ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి విజయ్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా. కానీ, విజయ్ చాలా కూల్. అతడు సెట్‌లో ఉంటే… వాతావరణం పాజిటివ్‌గా ఉంటుంది. అతడితో కలిసి నటించడం సులువు. అందుకే ఆ సినిమా షూటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది’ అంటూ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబాలి’లో నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు