సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్పంగా గాయపడ్డారు.
ఆయన హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో కొనసాగుతోంది.ఈ సందర్భంగా కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై బాలకృష్ణను సమీప ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన మోకాలికి స్వల్ప గాయమైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
కాకినాడ షూటింగ్‌లో బాలకృష్ణకు స్వల్ప గాయాలు
- Advertisement -


