అరవై ఏళ్లకోసారి పేర్లు మార్చుకొంటున్నది
ఈ వసంతం శ్రేణిలో నలుబదివిశ్వాసాల్నించి విసిగి
వేసారిన, జనత భవితకు “పరాభవ” పేరయ్యింది!!
x x x
కాల వైపరీత్యం విభిన్న ప్రాంతాల్లోదేశంలోఅంతర్జాతీయతల్లోనూ చీకాకులు
వర్తమానం సమరాలురూపాంతరాలుగా అస్తిమత్వాలు రగుల్తూనే ఉన్నాయి రివాజుగా రాజపూజ్యాలు నిన్న వ్రాసుకున్న
ఆదాయవ్యయాలు కొనసాగింపుల్తొ చిక్కులు
ఆశయాల్నించి నిజాయితీగా వార్షిక గానాలునవ్యాంకురాలకు ఊపిర్లై నాందీ ప్రస్థానంగా నిలవాలి గెలవాలన్న ఆశలు ప్రొది
పాదుల్లో మొలకెత్తుతాయనిసుపరిపాలనల తాకిడినిస్తూన్నాయి ఒరవడితో సంక్షేమాల బాట పట్టడానికి
సంక్షోభాల అగడ్తల్ని
దాటే ప్రయత్నపధంలో సాఫల్యమందాల్సిందే!!
I I I
కాలం ఏమయినా చేయగలదుకాలాన్ని పొడిగిస్తూనే సాక్షరతా తీరం ఆవేదనల్నించి మరో పుటను తెరవగలదు
చెడును కూలుస్తూమంచిని జీవనోత్సాహంగా మరల్చగలదు గబ్బిలంలా పట్టి పీడిస్తూన్న అప్రకటిత యుద్ధ కాంక్షలు సామ్రాజ్యాధిపత్యాల అజమాయిషీలపై పోరాటం అప్రతిహతాల గుండె నిబ్బరాలు కొనసాగిస్తూన్నాయి కొండంత సహనం ఆవేదనల సముద్రాల్నించి
జల “సంధి” రూపాల నిస్తేజాలకు నావికామార్గం అనివార్యం
కాలం ప్రాంతాల సముదాయికత్వంసమన్యాయం రాష్ట్రం దేశంవిశ్వాతరంగంలో రాజ్యాధికార కాంక్షల్లో మార్పు రావాలి. సత్ వర్తనంతో మానవత్వం మాననీయతవ్వాలి భీతావహ యుద్ధాలు శాంతి సామరస్యాలకు జనత జీవికకు
అశనిపాతాలౌతున్నాయన్నది అధి వాస్తవం
ప్రజా ప్రపంచపు శాంతి` దుఃఖాగ్నుల్ని దూరం చేయాలి
ఆ జాతి భద్రతలు బంగరు భవితలు సాఫల్యాలు
సాకారమయినప్ప్పుడే కాల చిత్రంలో ‘వసంతం’
నవ్యంగా భవ్యంగా మరో సంతకమౌతుంది! సంతసాన్నిస్తుంది.
వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులు
సెల్: 9441148158
ఇదీఒక వసంతం!కాల చిత్రం!!
- Advertisement -


