Homeసినిమాఉగాదికే 'ఉస్తాద్ భగత్ సింగ్'?

ఉగాదికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’?

- Advertisement -

బీజీఎం బాధ్యత తమను
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) అందించే బాధ్యత నుండి చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోగా, ఆ స్థానంలో
ఎస్.ఎస్.తమన్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామం పవన్ అభిమానులను, సినీ ప్రియులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2- ది రూల్’ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు తమన్, సామ్ సి.ఎస్. కలిసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్కా వడంతో ప్రేక్షకుల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక విశేషమేమిటంటే, ఈ రెండు భారీ చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుండటం గమనార్హం. వరుసగా రెండోసారి కూడా మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇక ఈ సినిమాను మార్చి 26న కాకుండా ఉగాది సందర్భంగా మార్చి 19నే విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు