Homeఉపాధి హామీ, ఎస్ఐఆర్, యూజీసీపైచర్చించాల్సిందే

ఉపాధి హామీ, ఎస్ఐఆర్, యూజీసీపైచర్చించాల్సిందే

- Advertisement -

అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం డిమాండ్
బడ్జెట్‌పైనే దృష్టి పెట్టాలి: ప్రభుత్వం

న్యూదిల్లీ: ఎంజీఎనఆరఈజీఏ తిరిగి అమలుతో పాటు ఎసఐఆర్, యూజీసీ నిబంధనలపై పార్లమెంటులో చర్చించాలని మంగళవారం అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వ ప్రతినిధులు ససేమిరా అన్నారు. బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. దీంతో సంప్రదాయం ప్రకారం ఒక రోజు ముందు అఖిలపక్షం భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. అధికార`విపక్ష కీలక నేతలు హాజరయ్యారు. ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌లను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తోసిపుచ్చారు. సభ సజావుగా జరగడంపైనే దష్టిపెట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులుగా మనం మన వాక్‌స్వేచ్ఛను వినియోగించుకుంటూనే ఇతర పార్టీల సభ్యులు చెప్పేది వినాలని సభ్యులనుద్దేశించి అన్నారు. వివాదాస్పద వీబీ జీ రామ్ జీ చట్టంపై చర్చకు మరో అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఒకసారి చట్టం జరిగితే… దానిపై వెనక్కివేళ్లేది లేదన్నారు. ఉభయ సభల్లో కొత్త ఉపాధి చట్టంపై సమగ్రంగా చర్చ జరిగిందని గుర్తుచేశారు. జరగబోయేది బడ్జెట్ సమావేశాలు కాబట్టి దష్టి మొత్తం బడ్జెట్‌పైనే ఉండాలని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలో ఇతర అంశాలను సభ్యులు లేవనెత్తవచ్చని తెలిపారు. జైరాం రమేశ్ (కాంగ్రెస్), జాన్ బ్రిట్టాస్ (సీపీఎం) మాట్లాడుతూ ఈ సమావేశాý అజెండా ఏదంటూ నిలదీయగా… తర్వాత పంపుతామని రిజిజు సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి కతజ్ఞత తీర్మానంపై చర్చ సందర్భంగా ఇతర అంశాలను చర్చించవ చ్చన్న సూచనపై సీపీఎం ఎంపీ అభ్యంతరం తెలిపారు. పద్ధతి ప్రకారం చర్చలు జరిపినప్ప్పుడే సంబంధిత మంత్రుల స్పందనలకు వీలు ఉంటుందన్నారు. ప్రభుత్వ సూచనను పాటిస్తే చాలా పరిమిత సమయం లభిస్తుందని, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సమగ్ర చర్చ కుదరదని జాన్ బ్రిట్టాస్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ మాట్లాడుతూ ఓట్ల చోరీ, ఎసఐఆర్, ధాన్యం సేకరణ, ఎంజీఎనఆర్‌జీఏ తిరిగి అమలు చేయడం తదితర అంశాలను తమ పార్టీ లేవనెత్తుతుందని చెప్పారు. కేంద్రం`రాష్ట్రం మధ్య సంబంధాలపై, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగంపై చర్చ కోసం డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు డిమాండ్ చేశాయి. దేశ విదేశాంగ విధానంపై సమగ్ర చర్చ విషయంలో ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్లు జాన్ బ్రిట్టాస్ తెలిపారు. అమెరికా ఏకపక్ష విధానాలు, ట్రంప్ శాంతి మండలి, వెనిజులా అధ్యÅ£ా దంపతుల అపహరణ సహా విదేశాంగ విధానంపై ప్రతిపక్షానిది ఒకటేమాటగా చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో కిరెన్ రిజిజు మాట్లాడుతూ సభ్యుల సలహాలు, సూచనలు వినేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. డీఎంకే, టీఎంసీ, వామపక్ష ఎంపీలు ఎసఐఆర్‌పై, ప్రత్యేకించి ఎన్నికల రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై చర్చను కోరారని, ఉభయ సభల్లో విస్తతంగా చర్చ జరిగిన దష్ట్యా మరోమారు చర్చించడం కుదరదని రిజిజు తెలిపారు. మళ్లీ చర్చించాలనడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు.
యూజీసీ కొత్త నిబంధనలపై వివాదాన్ని ప్రస్తావిస్తూ ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను పరిష్కరించడమే వీటి ఉద్దేశంగా కిరెన్ రిజిజు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు