Homeబ్యాంకు ఉద్యోగుల రణభేరి

బ్యాంకు ఉద్యోగుల రణభేరి

- Advertisement -

. స్తంభించిన బ్యాంకు సేవలు
. దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, ధర్నాలు
. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాల్సిందే
. ఒప్పందం అమలు చేయకుంటే ఆందోళన ఉధతం
. హెచ్చరించిన బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నేతలు
. సమ్మెకు సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ
. నిర్లక్ష్యం దుర్మార్గం: రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుý కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన 9 ఉద్యోగ సంఘాల బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ అధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. సమ్మెను పురస్కరించుకొని విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు పాల్గొని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రెటరీ కాశీ విశ్వనాథ్, అసోసియేషన్ అధ్యక్షులు వి.విజయ శేఖర్ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న ఐదు రోజుల పని దినాలను మన దేశంలో కూడా అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని వారు తెలిపారు. 2015 నుంచి ఉన్న డిమాండ్‌కు 2023లో ఎంఓయూ కుదిరిందని, 2024 ఏప్రిల్‌లో ఒప్పందం కుదిరిందని వారు తెలిపారు. అయినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఈ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఎన్‌సీబీఈ నాయకులు వీఎసఆర్ శేఖర్, ఇతర బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణ, సురేష్‌రెడ్డి, అజయ్ కుమార్, రఘురాం తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లోని ఆరఆర్ అప్పారావు వీధిలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి కృష్ణా జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షులు ఎన్.సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు వైఎస్ రావు మాట్లాడుతూ ఏపీటీబీఎఫ్, 12వ ద్వైపాక్షిక ఒప్పందం 9వ జాయింట్ నోట్లో అంగీకరించిన నిబంధనలు అమలు చేయడంలో ప్రభుత్వం, ఐబీఏ చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలపై విస్తృతంగా మాట్లాడారు. నాలుగు కార్మిక కోడ్ల అమలును ఆయన తీవ్రంగా విమర్శిస్తూ… అవి అనేక అంశాల్లో ఉద్యోగుల ప్రయోజనాలకు హానికరంగా, యజమానులకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్మిక కోడ్ల వల్ల కార్మికుల హక్కులు, చట్టపరమైన రక్షణలు నీరుగారిపోతున్నాయని ఆందోళనను వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఒప్పందాల అమలుకు చర్యలు తీసుకోవాలని, వీక్లీ ఆఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు
బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: రవీంద్రనాథ్
వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్కాపురం జిల్లాలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు. దీంతో ఎస్‌బీఐ, ఏపీజీబీ, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు తదితర బ్రాంచిలన్నీ మూతపడ్డాయి. జిల్లాలో వందకు పైగా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. స్థానిక స్టేట్‌బ్యాంకు కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ప్రదర్శనగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, కోర్టు సెంటర్, కంభం సెంటర్, పాత బస్టాండ్ మీదుగా ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పదించకపోవడం దారుణమని విమర్శించారు. 2022 వేతన సవరణ ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి బ్యాంకు శాఖల యూనియన్‌లకు ఒప్పందం జరిగిందని, ఆ సందర్భంగా 180 రోజుల్లో ఐదు రోజుల పనిదినాలు అమలుపరుస్తామని చెప్పారని, కానీ నేటికీ అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తూనే, మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి 2022లో జరిగిన వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని రవీంద్రనాథ్ హెచ్చరించారు. యూఎఫ్‌బీయూ నాయకులు కె.కాశిరెడ్డి, బాలునాయక్, రామారావు, రమణారెడ్డి, బి.రాజానాయక్, కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో
బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని విధాన ఒప్పందం వెంటనే అమలు పరచాలని కోరుతూ గుంటూరులోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయం వద్ద 1000 మందికి పైగా ఉద్యోగులు హాజరై పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఐదు రోజుల పని డిమాండ్ ఆవశ్యకతను వివరించి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. వెంటనే ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, ఇన్సూరెన్స్ నాయకులు మస్తాన్ వలి, బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు జయకుమార్, కిషోర్ కుమార్, భాషా, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో
ఏలూరు ఆరఆర్ పేట శ్రీనివాస్ థియేటర్ రోడ్డులో గల యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులంతా విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కాళే శ్రీనివాసరావు, రీజనల్ సెక్రటరీ విమల్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలుగా గుర్తించి,శని, ఆదివారాలు సెలవులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని ఏఐటీయూసీ¾ జిల్లా సహాయ కార్యదర్శి పి.కిషోర్, ఏలూరు ఏరియా కార్యదర్శి ఎ.అప్పలరాజు సందర్శించి మద్దతు తెలిపారు.యూఎఫ్‌బీయూ జిల్లా నాయకులు దుగ్గిరాల శ్రీనివాస్ మోహన్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కిషోర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీి ప్రసాద్, ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఐవీ సుధాకర్ తదితరులు మద్దతు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు