Homeఆంధ్రప్రదేశ్ఎన్‌హెచఆర్‌సీకివైసీపీ ఫిర్యాదు

ఎన్‌హెచఆర్‌సీకివైసీపీ ఫిర్యాదు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలన కొనసాగిస్తుందని వైసీపీ ఎంపీలు, నాయకుల బందం బుధవారం దిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ రమా సుబ్రహ్మణ్యానికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులను, గురజాల నియోజకవర్గంలోని మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు హత్య చేసిన ఘటనలను చైర్మన్ దష్టికి తీసుకెళ్లారు. ఎన్‌హెచఆర్‌సీ చైర్మన్‌ను కలిసిన వారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్‌రెడ్డి, సుభాశ్ చంద్రబోస్, గురుమూర్తి, బాబూరావు, అయోధ్య రామిరెడ్డి, తానూజా రాణి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్, ఎమ్మెల్సీలు అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు