Homeసినిమాఏఐఏఎఫ్‌లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్‌’

ఏఐఏఎఫ్‌లో ప్రదర్శనకు ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్‌’

- Advertisement -

భారతీయ చిత్రానికి దక్కిన అరుదైన గౌరం: రాజమౌళి
హైదరాబాద్: రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీ నుంచి ఆయన దర్శకత్వంలోనే రూపొందుతోన్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ఎటర్నల్ వార’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మాక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్`2026 (ఏఐఏఎఫ్)లోని వర్క్ ఇన్ ప్రోగ్రస్ విభాగంలో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది. దీనిపై దర్శకుడు రాజమైళి స్పందిస్తూ… ‘ఇది మన భారతీయ సినమాకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానన్నా. యానిమేషన్ అనేది హద్దులు లేని అద్భుత ప్రపంచం. ఈ విషయం తానెప్ప్పుడూ నమ్ముతాను. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యానిమేషన్ వేదికపై ఈ సినిమాను ప్రదర్శించే అవకాశం లభించడం మాకెంతో ఆనందంగా ఉంది. దీనికోసం ఎదురు చూస్తున్నాం’. అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. యానిమేషన్ రంగంలో ఈ ఫెస్టివల్‌ను ‘యానిమేషన్ ప్రపంచపు కేన్స్ ఫెస్టివల’గా పరిగణిస్తారు. ప్రపంచ వేదికపై భారతీయ యానిమేషన్ సత్తాను చాటి చెప్పేందుకు ఇదొక చక్కటి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరో పక్క రాజమౌళి అభిమానులు జై మాహిష్మతి అని గంతులేస్తున్నారు. సుమారు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్కా మీడియా వర్క్స’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు