విశాలాంధ్ర-ఒంగోలు : ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా కంచల జయరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు రోజులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరిగాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా అమరావతికి చెందిన కంచల జయరాజ్, ఉపాధ్యక్షులుగా కాకినాడ జిల్లాకు చెందిన కె.స్వాతి ప్రసాద్, ఏలూరు జిల్లాకు చెందిన కె.మాణిక్యరావు, కృష్ణా అర్బన్ జిల్లాకు చెందిన చావా రవి, కర్నూలు జిల్లాకు చెందిన జి.కొండప్ప, కార్యదర్శులుగా అనకాపల్లి జిల్లాకు చెందిన సీహెచ్బీఎల్ స్వామి, పల్నాడు జిల్లాకు చెందిన విద్యాధరణి మురళి, ప్రకాశం జిల్లాకు చెందిన అలుగుల సురేశ్, తిరుపతి జిల్లాకు చెందిన ఎంపీఆర్ రాజు, కోశాధికారిగా నెల్లూరు జిల్లాకు చెందిన వల్లూరు వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా విజయనగరం జిల్లాకు చెందిన మునగపాటి సూర్యనారాయణ రాజు, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అట్లవాక కిశోర్ కుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన వై.కాలేశ్వరం రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బి.నాగరాజు, వైయస్సార్ కడప జిల్లాకు చెందిన చెన్నుపల్లి వెంకటరెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన జి.శ్రీనివాసులు, బి.అక్కులప్ప, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యు.వెంకట్రావు, బాపట్ల జిల్లాకు చెందిన సీహెచ్ రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వై.మురళీకృష్ణ, అనంతపురం జిల్లాకు చెందిన సీహెచ్ దుర్గాప్రసాద్ రెడ్డి, నంద్యాల జిల్లాకు చెందిన కేవీ శ్యామ్ సుందర్ లాల్, గుంటూరు జిల్లాకు చెందిన ఎస్కే నాగూర్ మీరా, సత్యసాయి జిల్లాకు చెందిన డి.బాబు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎంఎన్వీ ప్రసాద్ ఎంపికయ్యారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఐవీ సుబ్బారావు, కంచల జయరాజ్
- Advertisement -
RELATED ARTICLES


