Sunday, November 16, 2025
Homeవిశ్లేషణఒంటరి నేను!

ఒంటరి నేను!

- Advertisement -

అరూనిమా సిన్హా అనే మహిళ గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు. అమె వికలాంగురాలు. అయినా పవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా వికలాంగురాలామె. 2011లో ఒక దొంగలముఠా కదులుతున్న రైలు నుంచి ఒంటరి మహిళ అయిన ఆమెను బయటకు తోసేసింది. దీంతో ఆమె పడమకాలును పోగొట్టుకుంది. మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి, నిబద్ధత, పట్టుదల…ఇలాంటివన్నీ ఆమెకు అక్కాచెల్లెళ్లు. అందుకే అరూనిమా తన వైకల్యాన్ని అధిగమించి, 2013 మే 21వ తేదీన శిఖరపు అంచున భారత త్రివర్ణ పతాకాన్ని పగురవేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. జుడిత్‌ హ్యూమన్‌ అనే మహిళ కూడా ఇలాంటిదే. ఆమె కాళ్లు చచ్చుపడిపోయి, చక్రాల కుర్చీలోనే జీవితాన్ని సాగించేది. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఆమెకు టీచింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి నిరాకరించారు. వికలాంగురాలు పాఠాలు చెప్పకూడదా? వెంటనే ఆమె కోర్టుకెక్కారు. బోర్డు ఆఫ్‌ పడ్యుకేషన్‌పై కేసు వేసి, గెలిచారు. వీల్‌చెయిర్‌లో క్లాస్‌రూమ్‌లోకి వచ్చి పాఠాలు చెప్పిన తొలి ఉపాధ్యాయురాలిగా, వికలాంగుల హక్కుల ఉద్యమానికి ఆధ్యురాలిగా ఆమె చరిత్రకెక్కారు. మార్లీ మాట్లిన్‌ విజయగాథ కూడా ఇలాంటిదే. ఆమెకు మాటలురావు. కానీ మహానటిగా హాలీవుడ్‌ ప్రపంచాన్ని ఏలింది. పన్నో సినిమాల్లో నటించిన మార్లీ మాట్లిన్‌ 1986లో విడుదలైన ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ ఏ లెస్సర్‌ గాడ్‌’ అనే సినిమాలో అద్భుతమైన నటనకు ఆస్కార్‌ అవార్డును చేజిక్కించుకున్నారు. డాక్టర్‌ మాళవికా అయ్యర్‌ అనే భారతీయ మహిళ కూడా ఈ కోవకే చెందుతారు. చిన్నప్పుడే ఆమె ఒక బాంబు పేలుడులో రెండు చేతులను కోల్పోయింది. తీవ్ర గాయాలతో కాళ్లను సైతం పాక్షికంగా కోల్పోయింది. అయినప్పటికీ, సామాజిక సేవారంగంలో పీహెచ్‌డీ పట్టా పొంది, కోట్లాదిమంది మహిళా వికలాంగులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచింది. భారతీయ వికలాంగుల హక్కుల కార్యకర్తగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా రాణిస్తోంది. హెలెన్‌ కెల్లర్‌ గురించి తెలియని వారుండరు. పాఠ్యాంశాల్లో ఆమె విజయగాథను చదవని వారులేరు. పుట్టుగుడ్డి, బధిరురాలు (వూగ) అయిన హెలెన్‌ 20వ శతాబ్ధంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళలల్లో ఒకరుగా నిలిచారు. ఆమె బీఏ డిగ్రీ పొందిన తొలి బధిరురాలు, అంధురాలు. ఫ్రిదా కహ్లో అనే మెక్సికన్‌ పెయింటర్‌ పోలియో వ్యాధితో బాధపడుతూనే, గొప్ప చిత్రకళాకారిణిగా పదిగింది. ఒక ‘కల్చరల్‌ ఐకాన్‌’గా నిలిచింది. సుధా చంద్రన్‌ కూడా తెలిసిన మహిళే. 16వ ఏట ఒక కారు ప్రమాదంలో కాలుపోగొట్టుకున్న సుధా కాలులేకుండా భరతనాట్యం చేయడం సాధ్యం కాదని తెలిసినా, దాన్ని సుసాధ్యం చేసింది. ఆమె నటిగా కూడా రాణించింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాకారిణి బిల్లీ ఈలిష్‌ చిన్నప్పటి నుంచి టొరెటో సిండ్రోమ్‌తో బాధపడుతూనే గ్రామీ అవార్డులను, ఆస్కార్‌ అవార్డులను గెల్చుకొని విశ్వ సంగీత సంచలనంగా నిలిచింది. ఇలా చెప్పుకుంటూపోతే, పందరో మహిళా వికలాంగులు గొప్పవారై వెలుగొందారు. పన్ని విజయగాథలున్నా…నేటికీ మహిళా వికలాంగులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. సమాజంలో చిన్నచూపునకు గురై, బానిసల్లా బతుకుతూనే ఉన్నారు. ఆంచల్‌ బతీజా అనే మహిళ వూడు మాసాల క్రితం (2025 జూన్‌) సుప్రీంకోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆమెకు తెలుసు, ఆమె సుప్రీంకోర్టు ముందు హాజరైన తొలి అంధురాలైన న్యాయవాది. అన్నింటికన్నా ముందు, తాను కోర్టుకెలా వెళ్లాలి? అనుబంధ పత్రాలు పలా చదవాలి? పేజి నెంబర్లు పలా గుర్తు పెట్టుకోవాలి? న్యాయవూర్తి అడిగే ప్రతి ప్రశ్నకు తానిచ్చే ప్రతి సమాధా నవూ ఆమెకొక సాహసమే. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆమె క్లయింట్‌ కూడా అంధురాలే. ఉత్తరాఖండ్‌ జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. అందులో రిజర్వేషన్లను ప్రస్తావించినప్పుడు వికలాంగుల గురించి ప్రస్తావనే లేదు. దీంతో ఆ మహిళ కేసు పెట్టింది. ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ పూర్తిగా ఏకపక్షమని ఆంచల్‌ కోర్టులో నిలదీసింది. ఆంచల్‌ పుట్టుకతోనే పాక్షికంగా అంధురాలు. టెన్త్‌క్లాస్‌ పరీక్షలకు ముందు కళ్లు పూర్తిగా పోయాయి. అక్షరాలు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో ఒక రిపోర్టర్‌ సాయం తీసుకొని, పరీక్షలు రాసింది. ఇంటర్‌లో 97.2% మార్కు లతో జిల్లాలోనే ప్రథమస్థానం సాధించింది. ఆమె కసిగా చదివి అడ్వకేట్‌ అయి వికలాంగులైన మహిళల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు.
మీకు తెలుసా? ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఏదో ఒక అవయవ లోపంతో బాధపడుతున్నారు. వీరిలో పక్కువమంది మైనారిటీలు, దళితులు, పల్‌బీటీలు (లెస్బియన్లు, బైసెక్సువల్స్‌, ట్రాన్స్‌జెండర్లు), శరణార్థులు, వలసకార్మికులే. jూపన్‌ వుమెన్‌ సంస్థ నివేదిక ప్రకారం, వికలాంగులైన మహిళలు సాధారణ మహిళల కంటే రెండు వూడు రెట్లు అధికంగా దాడులను పదుర్కొంటున్నారు. సొంత కుటుంబంలోనే వారు గృహహింసకు గురవుతున్నారు. వికలాంగులైన పురుషుల కన్నా వారు వూడు రెట్లు అధికంగా నిరక్షరాస్యతతో బాధపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా వికలాంగులకు అవకాశాలు కల్పించడంపై 155 సంస్థలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లకు కమిషనర్‌ ఆఫ్‌ పెర్సన్స్‌ విత్‌ డిజాబిలిటీస్‌ (సీపీడబ్ల్యుడీ) రూ.10 వేలు చొప్పున అపరాధ రుసుము విధించింది. అందులో 95 వెబ్‌సైట్లు స్పందించకపోవడంతో ఆ ఫైన్‌ను రూ.50 వేలకు పెంచింది. కులాలన్నీ ఏకమవుతున్నా, అన్ని అవయవాలున్న మనిషి మాత్రం తన తోటి మనుషులైన వికలాంగులను తమలో కలుపుకో వడం లేదు. ముఖ్యంగా మహిళా వికలాంగులు హింస, దుర్వినియోగం, బహుళ రకాల వివక్ష, శారీరక లైంగిక వేధింపులు, విద్యాఉపాధి అవకాశాల లేమి, ఆరోగ్య సంరక్షణలో అసమానతలు, అధికారస్థానాల్లో గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలతో వారి గొంతు సరిగా వినపడటం లేదు. పన్ని చట్టాలు ఉన్నా, చేjూతనిచ్చే సంస్థలు పన్ని ఉన్నా, ఆంచల్‌ అన్నట్లుగా…‘నేను ఒంటరిని… ఒంటరిగానే పోరాడుతాను’. మహిళా వికలాంగులకు అదొక్కటే స్ఫూర్తి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు