ఓ గాలి

- Advertisement -

ఓ గాలీ! పాట పాడుతూరావే
దూసుకుంటూ రావే
కొమ్మల నుర్రూతలూగిస్తూరావే
ధూలిని ఎగరేస్తూరావే!
మధురమైన పరిమళాన్ని
నా ప్రాణాలలో నింపి
తూర్పు గాలివై
దూరాన్న ఉన్న ఆ పర్వత శిఖరాల
నుంచి గెంతుకుంటూరావే!
ఓ గాలీ!
మత్తుతో నిండిన యవ్వనంతో
కొత్తగా చిగురించిన ఈ ఆకుపచ్చని ఆకులును
ముద్దుపెట్టుకుంటూ రావే!
అస్పష్ట స్వరంతో పాడుతూ రావే!
మేఘాలను కొల్లగొడుతూ రావే!
స్మారకములేని మనసు స్మారకములేని తనువు
పకపకలాడుతూ, రసవంతమైన, ప్రాణశక్తి గల
హృదయ తీగలను ఝుమ్మని మ్రోగించుతూ
నాట్యమాడుతూరావే!
ఓ గాలీ! ఓ గాలీ!!
హిందీ మూలం: డాక్టర్ మహేంద్ర భటనాగర్
తెలుగు అనువాదం: పారనంది నిర్మల
సెల్: 9985103804

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు