మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో, సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వి.డి. రాజగోపాల్ సారథ్యంలో ప్రసిద్ధ సాహితీమూర్తి, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ 88వ పుట్టినరోజు వేడుకలు 05.07.2027వ తేదీన ఘనంగా నిర్వహించాలని, ఈ మోత్తర సందర్భాన్ని పురస్కరించుకుని ఒక బృహత్ కవిసమ్మేళనం, ప్రత్యేక కవితా సంపుటి ప్రచురణ చేపట్టడం జరుగుతోంది.
విశేషాలు & వివరాలు:
గురుదక్షిణ సంపుటి: ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ సేవలకు ప్రతీకగా, వారి రచనల ఆధారంగా కవులు రాసే ఉత్తమ కవితలను “గురుదక్షిణ” పేరుతో ఒక విశిష్ట కవితా సంపుటి రూపంలో ప్రచురించడం జరుగుతుంది.
ఆధార గ్రంథాలు: ఇనాక్ రచనలకు సంబంధించిన10 పీడీఎఫ్లు ఇప్పటికే గ్రూప్‌లో షేర్ చేశారు. ఆ రచనల స్ఫూర్తితో మీ కవితలు ఉండాలి.
బంగారు అవకాశం: సాహితీలోకంలో ఇదొక సువర్ణావకాశం. కవులందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాము.
కవితలు పంపవలసిన నిబంధనలు:
చివరి తేదీ: 25.06.2026 లోపు తప్పనిసరిగా పంపాలి. (గడువు దాటిన తర్వాత వచ్చే కవితలు స్వీకరించరు).
కావలసినవి: మీ కవితతో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా జతపరచాలి.మీ కవితలను ఈ క్రింది వాట్సాప్ నంబర్‌కు పంపగలరు: 9110784502
పోలయ్య కవి, కూకట్లపల్లి
కవి సమ్మేళన సమన్వయకర్త
రాజాం రచయితల వేదిక 137వ సమావేశం
ఈ జూన్ నెల 28 ఆదివారం ఉదయం 10.00 గంటలకు విజయనగరం జిల్లా, రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితలవేదిక 137వ సమావేశం జరుగుతుంది. సభకు పిల్లా తిరుపతిరావు అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో ‘కళింగాంధ జనజీవన తాత్తిÇకత` సందువ’ అనే అంశంపై నల్ల రవికుమార్ పసంగిస్తారు. సందువ కవితాసంపుటి రచయిత బాల సుధాకర మౌళి తదితరులు హాజరౌతారు.
గార రంగనాథం, 98857 58123
రాజాం రచయితల వేదిక


