Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంకాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -

భోపాల్‌: కాంగ్రెస్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌లోని భండేర్‌ శాసనసభ్యుడు పూల్‌ సింగ్‌ బరయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలను సమర్థిస్తూ మహిళలను తీవ్రంగా కించపరిచారు. కొన్ని కులాలు, వర్గాల మహిళలపై లైంగిక దాడి జరుగుతోందని, వారితో కోరిత తీర్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం దక్కుతుందనే ఇలా చేస్తున్నారని, ఈ విషయం పుస్తకాల్లో కూడా ఉందని వ్యాఖ్యానించారు. అందమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనస్సు చలించి అత్యాచారానికి పాల్పడే అవకాశముందని అన్నాడు. కొన్ని వర్గాల మహిళలు మాత్రం అందంగా ఉండరని, అలాంటి వారితో కలిస్తే ఏదో లాభం ఉంటుందని ఆశించి అత్యాచారాలు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బీజేపీ, వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సిద్ధాంతం ఇదేనా? ఈ వ్యాఖ్యలు ఆయన నీచబుద్ధిని బయటపెట్టాయని బీజేపీ విమర్శించింది. ఆలిండియా బ్రాహ్మణ పరిషత్‌ నేత పండిత్‌ పుష్పేంద్ర మిశ్రా కూడా పూల్‌ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే పూల్‌ సింగ్‌ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌ అధ్యక్షుడు జీతూ పట్వారి తేల్చిచెప్పారు. అత్యాచారాన్ని సమర్థించలేమని, లైంగిక దాడికి పాల్పడే వారిది ఏ కులం, మతమైనాగానీ నేరస్థులే అవుతారని ఆయన వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు