Homeకేంద్ర నిధులపై నిర్లక్ష్యం

కేంద్ర నిధులపై నిర్లక్ష్యం

- Advertisement -

. చేజారిన రూ.5,051 కోట్లు!
. సాంకేతిక కారణాలతో రూ.828 కోట్ల బిల్లుల తిరస్కరణ
. ఖజానా ఖాళీగా ఉన్నా… వచ్చిన నిధులు వాడుకోవడంలో అధికారుల వైఫల్యం

విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోసే కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంలో యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న 79 కేంద్ర పథకాల తీరుతెన్నులపై విస్తుపోయే నిజాలను ఆ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.5,051 కోట్లు (34 శాతం) ఖర్చు చేయలేకపోవడం వల్ల ఆ నిధులు మురిగిపోయాయి. ఇది రాష్ట్ర ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. 2025-26 లో 79 కేంద్ర ప్రాయోజిత పథకాలకుగాను కేంద్రం రూ.15,126 కోట్లు కేటాయించగా, రూ.11,324 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రాష్ట్రం వినియోగించుకుంది. రూ.3,851 కోట్లు మాత్రమే. మొత్తం కేటాయింపుల్లో ఇది 25 శాతం కాగా మంజూరయిన నిధుల్లో 34 శాతమే. మరికొంత మొత్తం నిధులకు క్లియరెన్స్ రాలేదు. 2024-25 లో రూ.14,109 కోట్లు రాష్ట్రానికి మంజూరు కాగా అందులో రూ.7,849 కోట్లు వినియోగించుకుంది. అంటే 55 శాతం నిధులు వాడుకోగలిగింది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిధులు వాడుకోవడంలో ఆర్థిక శాఖ చాలా విఫలమైంది. స్పర్శ్ అమలులోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలోనూ రాష్ట్రాలన్నీ కేంద్ర పథకాల నిధులు భారీగా కోల్పోయాయి. కేంద్రం నుంచి నిధులు మంజూరయిన ప్పటికీ అవి ప్రజలకు చేరకపోవడానికి గల కారణాలను గణాంకాలతో సహా వివరించింది. మార్చి చివరి వారంలో పంపిన రూ.828 కోట్ల బిల్లులు (కేంద్ర వాటా రూ.491 కోట్లు, రాష్ట్ర వాటా రూ.337 కోట్లు) కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. బడ్జెట్ అంచనాల్లో మార్పులు రావడం, నాలుగో త్రైమాసికంలో నిధుల విడుదలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. తిరస్కరణకు గురైన బిల్లులకు సంబంధించి వెంటనే కేంద్ర అధికారులకు లేఖలు రాసి, రాబోయే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ ‘మదర్ శాంక్షన్లు’ పొందేలా చర్యలు తీసుకోవా లని అన్ని శాఖల కార్యదర్శులను ఆర్థిక శాఖ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాల్లో తెచ్చిన అప్ప్పులన్నింటినీ అభివృద్ధి కోసం కాకుండా రెవెన్యూ ఖర్చులకు దారి మళ్లిస్తున్నాయి. దీంతో అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయి. నాబార్డు, ఈఏపీ నుంచి తెచ్చే అప్ప్పులను మాత్రమే మౌలిక సదుపాయాల ప్రాజె క్టుల కోసం ఉపయోగిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి క్షీణత కారణంగా ఇప్ప్పుడు ఈఏపీ అప్ప్పులను కేంద్రం ప్రోత్సహించడం లేదు. అందుకే సాస్కీ రూపంలో రాష్ట్రాలకు వడ్డీ లేకుండా 50 ఏళ్ల కాలపరిమితితో అప్ప్పులు ఇస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కానీ తిరిగి కట్టక్కర్లేని కేంద్ర పథకాల నిధులకు కోత పెట్టి, వడ్డీ లేని అప్ప్పులంటూ రాష్ట్రాలకు సాస్కీ రూపంలో ఇస్తోంది. వడ్డీ లేకపోయినా ఎప్ప్పుడో ఒకప్ప్పుడు ఈ అప్ప్పులు కట్టాల్సిందే. అదే కేంద్ర పథకాలకు నిధులు వస్తే వాటిని రాష్ట్రాలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సాస్కీ కింద ఏ పనులు చేయాలన్న నియమ నిబంధనలు ఏమీ లేవు. దీంతో గతంలో రోడ్లు వేసిన వారి బిల్లులు, ఇతర క్యాపిటల్ పనులు చేసి రాజ కీయ పలుకుబడి ఉన్న వారి బిల్లులను సాస్కీ కింద చూపించి కేంద్రం నుంచి అప్ప్పు తెచ్చి చెల్లింపులు చేస్తున్నారన్న విమ ర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏజెన్సీల వద్ద ఉన్న రూ.21,437 కోట్ల నిధుల్లో 88 శాతం ఖర్చు చేశామని చెబుతూనే, జిల్లాల వారీగా ఉన్న వ్యత్యాసాలను ఎత్తి చూపింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు 99 శాతం నిధులను వినియోగించి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచాయి. శ్రీకాకుళం, పల్నాడు జిల్లాలు 98 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు వంటి జిల్లాల్లో నిధుల వినియోగం ఆశించిన స్థాయిలో లేదని, అక్కడ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ప్రజలకు అందాల్సిన పథకాలు నిలిచి పోతాయని హెచ్చరించింది. న్యాయ శాఖ, పురపాలక శాఖ, ఉన్నత విద్యా శాఖలు నిధుల వినియోగంలో అద్భుత పనితీరు కనబరిచాయని అభినందిం చింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో ఇంకా ఖర్చు చేయకుండా మిగిలిపోయిన రూ.438 కోట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా పీఎం ఆవాస్ యోజన (అర్బన్ అండ్ రూరల్), పీఎం పోషణ్, అంగన్‌వాడీలకు సంబంధించిన నిధులు ఇందులో ఉన్నాయని, పేదల ఇళ్ళు, పిల్లల ఆహారానికి సంబంధించిన ఈ నిధులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వాడాలని అధికారులను ఆదేశించింది. స్పర్ష్ పోర్టల్ ద్వారా బిల్లుల చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించుకో వాలని సూచించింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం నుంచి రూ.26,020 కోట్లు రాబట్టడమే లక్ష్యమని ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘సాస్కీ’ (మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం) కింద గత ఏడాది రావాల్సిన రూ.10,452 కోట్లలో రూ.8,290 కోట్లు మాత్రమే వచ్చాయని, మైనింగ్, అర్బన్ ప్లానింగ్ రంగాల్లో నిర్లక్ష్యం వల్ల నిధులు తగ్గాయని గుర్తుచేసింది. వచ్చే ఏడాది టెలికం, అగ్రి స్టాక్, లైవ్‌స్టాక్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా రూ.7,026 కోట్ల సాస్కీ నిధులను సాధించవచ్చని తెలిపింది. ఐఎంఆర్, ఎంఎంఆర్, టీబీ మరణాలను తగ్గించడం ద్వారా మరో రూ.650 కోట్ల అదనపు ప్రోత్సాహకాలను కేంద్రం నుంచి పొందవచ్చని వివరించింది. అఖండ గోదావరి ప్రాజెక్టు, గండికోట అభివృద్ధి, విశాఖపట్నంలో యూనిటీ మాల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర నిధులే కీలకం. ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి కేంద్రం ఇచ్చే ప్రతి పైసాను రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలని ఆర్థిక శాఖ సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు