Homeకేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం

- Advertisement -

. సెప్టెంబర్ 28న ‘చలో దిల్లీ’
. ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు
. సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయం
. వెల్లడించిన డి.రాజా

న్యూదిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని bన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం పూరించింది. మోదీ సర్కారు విధానాలను ఎడగడుతూ భారీ ఎత్తున దేశవ్యాప్త నిరసనలకు పూనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో రెండు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు రాజకీయ కార్యాచరణను రూపొందించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారంనాడు దిల్లీలోని అజయ్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ సమితి సమావేశాల నిర్ణయాలను వెల్లడించారు. దేశం ఎదుర్కొంటున్న కీలక రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్లపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి సమావేశాలు సుదీర్ఘంగా చర్చించి, వివిధ కీలక తీర్మానాలను ఆమోదించిందని తెలిపారు. బీజేపీఆర్ఎస్ఎస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలకు పిలుపునిచ్చిందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో bన్నికల్లో అక్రమ మార్గాన బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిందని, సజావుగా, న్యాయబద్ధంగా bన్నికలను నిర్వహించడంలో విఫలమైందని విమర్శించారు. తమిళనాడులో ప్రజాతీర్పును అపహాస్యంపాలు చేయడానికి గవర్నర్ చేసిన కుట్రను తిప్పికొట్టినట్లు తెలిపారు. బీజేపీని అడ్డుకోవడానికే టీవీకేకు సీపీఐ మద్దతునిచ్చిందని రాజా పేర్కొన్నారు. కేరళంలో bల్‌డీbఫ్ పరాజయంపై సమీ¿ాìస్తామని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో భారీగా ఓట్లను తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను, bన్నికల చట్టబద్ధతను తుంగలోతొక్కిందన్నారు. ఇండియా ఐక్యసంఘటనలో సఖ్యత లోపించిన విషయాన్ని గుర్తించినట్లు రాజా తెలిపారు. వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమితి సమావేశాల్లో చేసిన తీర్మానాలను రాజా వివరించారు. తీర్మానాల్లోని ముఖ్యాంశాలు: కార్మిక వర్గ పోరాటాలకు సంఘీభావం దేశంలోని పారిశ్రామిక కేంద్రాలైన నోయిడా, మానెసర్, సూరత్, భివాడి వంటి ప్రాంతాల్లో కార్మికులపై జరుగుతున్న దోపిడీని సమితి ఖండించింది. కనీస వేతనాల అమలు, సామాజిక భద్రత, యూనియన్ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై పోలీసుల అణచివేతను తీవ్రంగా తప్ప్పుబట్టింది. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు పారిశ్రామిక శాంతికి విఘాతమని, అరెస్టయిన కార్మికులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తమిళనాడులో ఒకే సంస్కృతి రుద్దుడుపై విమర్శ తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ ప్రమాణ స్వీకార వేడుకలో ‘తమిళ తాయి వళుత్తు’ పాడటానికి ముందు వందేమాతరం ఆలపించడాన్ని సీపీఐ తప్ప్పుబట్టింది. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఆర్ఎస్ఎస్‌బీజేపీ కూటమి బలవంతంగా ఒకే సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. గవర్నర్ పాత్రను ఎండగడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విభజన శక్తులను అడ్డుకోవాలని సూచించింది.
మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశతాబ్ది ఉత్సవాలు
2026 ఏప్రిల్ 11 నుండి 2027 ఏప్రిల్ 11 వరకు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కుల వివక్ష, పితృస్వామ్యంపై ఫూలే దంపతులు చేసిన పోరాటం అజరామరమని, సామాజిక సమానత్వం లేనిదే సోషలిజం సాధ్యం కాదని తీర్మానించింది.
మహిళా రిజర్వేషన్లపై జాప్యం
మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలును జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని సీపీఐ ఖండించింది. ఇది మహిళలకు ప్రాతినిధ్యాన్ని నిరాకరించే కుట్ర అని, గీతా ముఖర్జీ వంటి నేతల పోరాట ఫలితమైన ఈ బిల్లును తక్షణమే ఎటువంటి నిబంధనలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ఎరువుల కొరత`రైతు సమస్యలు
2026 ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటిం>ù వల్ల రైతులు bదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రంపై విరుచుకుపడింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సీ2G50% ఫార్ములాతో కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పి) చట్టబద్ధత కల్పించాలని పార్టీ డిమాండ్ చేసింది. ఈ సమితి సమావేశాల్లో సీపీఐ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను రూపొందించి, ఏకగ్రీవంగా ఆమోదించిందని డి.రాజా వెల్లడించారు.
ఆగస్టు 6 నుండి పాదయాత్రలు
బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండగట్టేందుకు ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో పాదయాత్రలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రాజ్యాంగ విలువలపై దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పాదయాత్రలు జరుగుతాయి.
చలో ఢిల్లీ
ఈ నిరసన కార్యక్రమాలు సెప్టెంబర్ 28న (షహీద్ భగత్ సింగ్‌ జయంతి) ఢిల్లీలో భారీ బహిరంగ సభతో ముగుస్తాయి. కార్మికులు, రైతులు, మహిళలు, యువత, దళిత, ఆదివాసీ మైనారిటీ వర్గాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు