Homeసినిమాజోర్డాన్‌లో ఎన్టీఆర్`రుక్మిణిపైపాట చిత్రీకరణ

జోర్డాన్‌లో ఎన్టీఆర్`రుక్మిణిపైపాట చిత్రీకరణ

- Advertisement -

హైదరాబాద్: ప్రశాంత్ నీల్`ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై తాజా కబురు వినిపిస్తోంది. వచ్చే వారం ఎన్టీఆర్, రుక్మిణి వసంత్ మధ్య ఓ పాట చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. జోర్డాన్‌లో ఈ పాట ఘాట్ చేయనున్నారు. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు