హైదరాబాద్: గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా హీరోయిన్స్ నయనతార, కియార అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్. కన్నడ, ఇంగ్లీష్ లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ఏ ర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు అభిమానులకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే…. మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ని మార్చ్ 19 నుంచి, జూన్ 2కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


