Homeఆంధ్రప్రదేశ్టీడీపీ గూటికి బొత్స మేనల్లుడు

టీడీపీ గూటికి బొత్స మేనల్లుడు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: స్థానిక ఎన్నికల వేళ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా, జెడ్పీ చైర్మన్‌గా, భీమిలి నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తన రాజీనామా లేఖను అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. అనంతరం తన కుమార్తె సిరి సహస్త్ర, అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కొండ్రు మురళి, కోళ్ల లలితకుమారి హాజరయ్యారు. బొత్స సత్యనారాయణతో విభేదాý కారణంగా శ్రీను టీడీపీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు