- Advertisement -
- స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ తరుపున హిందూపురం, కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్తగా చిలకం మధుసూదన్ రెడ్డి ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని హిందూపురం మరియు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాల స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా పార్టీ తరఫున నియమించింది. వారితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, సమన్వయం కోసం మరో 20 మంది సభ్యులతో కూడిన కోఆర్డినేషన్ టీమ్‌ను పార్టీ ఏర్పాటు చేసింది. ఈ బృందం ఆయా పార్లమెంట్ పరిధిలోని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు మరియు గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ప్రాతినిధ్యం సాధించేలా అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం సేకరణ, నాయకులు,కార్యకర్తల సమన్వయం వంటి అంశాల్లో పనిచేయనుంది.


