విశాలాంధ్ర అనంతపురం టౌన్ : తమకు పదోన్నతి కల్పించి, వృత్తిపరంగా ముందడుగు వేసే అవకాశం కల్పించిన జిల్లా ఎస్పీ పి.జగదీష్,ని మరియు అదనపు ఎస్పీ ఎం.నాగభూషణంను పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 2007, 2009 బ్యాచ్లకు చెందిన 54 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ.. పోలీసు కానిస్టేబుళ్లుగా బందోబస్తు, స్టేషన్ నిర్వహణ, కోర్టు డ్యూటీలు, శాంతిభద్రతల పరిరక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించారని కొనియాడారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందినందున ఇకపై కేసులు నమోదుతో పాటు దర్యాప్తు చేసే అధికారాలు వస్తాయని, ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సూరి, లక్ష్మినారాయణలు పాల్గొని పెద్ద ఎత్తున్న పదోన్నతులు కల్పించిన జిల్లా ఎస్పీ కి మరియు అదనపు ఎస్పీ కి జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితో పాటు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఏ.ఆర్ నుండీ సివిల్ కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
54 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి….
- Advertisement -


