Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసెప్టెంబర్ 11న అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం..

సెప్టెంబర్ 11న అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం..

- Advertisement -

రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి
విశాలాంధ్ర ధర్మవరం;;రాష్ట్రంలో నెలకొన్న కరువు తీవ్ర పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే కరువు సహాయచర్యలు చేపట్టాలని, నష్ట పోయిన రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కార్మికులను, చేనేత. చేతి వృత్తి దారులను, మత్స్య కారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర సమితి ల పిలుపుమేరకు సెప్టెంబర్ 11వ తేదీన అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున “ధర్నా”లు నిర్వహిస్తామని జింక చలపతి పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్నా నిర్వహించిన తర్వాత సమస్యలతో కూడిన మెమోరాండం ను సమర్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సమాఖ్య తరపున చేతి వృత్తి దారులు విధిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమాలలో సి.లింగమయ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు. కె.రామాంజనేయులు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సత్య సాయి జిల్లా రైతు నాయకుడు కాటమయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుళ్లాయప్ప చేనేత నాయకులు
శ్రీనివాసులు తదితరులు పాల్గొంటారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు