సీపీఐ
న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్పడం లేదని సీపీఐ ప్రశ్నించింది. ట్రంప్ బెదిరింపులకు లొంగవద్దని సర్కారుకు హితవు పలికింది. రష్యా వంటి దేశాలతో వాణిజ్యం, సహకారం కోసం సార్వభౌమ హక్కు భారత్‌కు ఉందని అమెరికాకు స్పష్టం చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం సూచించింది. అమెరికా జోక్యాన్ని, బెదిరింపు ధోరణిని తిరస్కరించాలని, ఏదేని సామ్రాజ్యవాద శక్తికి భాగస్వామిగా కాకుండా సమాన సహకారాధారిత విదేశాంగ విధానాన్ని పునరుద్ఘాటించాలని డిమాండ్ చేసింది. ‘అమెరికాతో వాణిజ్య సంబంధాలను భారత్ కొనసాగించాలి. కానీ అవి పరస్పర ప్రయోజనం ఇచ్చేవిగా, సమాన స్థాయిలో ఉండాలి. ఏకపక్ష డిమాండ్లుతో లేక ప్రతిబంధకాలతో అమెరికా శాశించేలా ఉండకూడదు. ట్రంప్ బెదిరింపులు, అవమానాలను కేంద్రప్రభుత్వం తేలికగా తీసుకొని, వినయంగా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైఖరి బీజేపీ ప్రభుత్వ పరికితనానికి, పశ్చిమ దేశాలపై ఆధారానికి… ముఖ్యంగా దేశ ప్రయోజనాలను అమెరికా కోసం పణంగా పెట్టేయడానికి అడ్దం పడుతోంది’ అని సీపీఐ వ్యాఖ్యానించింది. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్ లేక ఇతర దేశంపై సుంకాలు విధించడం లేక శిక్షనాత్మక చర్యలు తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ సుంకాలనుద్దేశించి పేర్కొంది. భారత్‌పై అమెరికా 25 శాతం సుంకం విధించడాన్ని ఆక్షేపించింది. ఇతర దేశాల ఆర్థిక`విదేశాంగ విధానాల ఎంపికల్లో జోక్యాన్ని, వాటిని శాశించే లక్ష్యంతో ఒత్తిడిని పెంచడం వాటిని అవమానించడమే అవుతుందని పేర్కొంది. భారత్ సార్వభౌమ దేశమని, దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా లేక గ్లోబల్ సౌత్‌లోని ఏ దేశంతోనైనా వాణిజ్య సంబంధాలు పెట్టేకునే స్వేచ్ఛను కలిగివుందని సీపీఐ నొక్కిచెప్పింది. వాణిజ్య`సహకార బంధాలతోనే భారత్ పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడిర చింది. ఇంధన భద్రత సాధించడం, రక్షణ సామర్థ్యాలు పెంచుకోవడం, భౌగోళిక రాజనీతి సంబంధమైన సమతుత్యత పొందడం కోసం ఈ బంధాలు భారత్‌కు దోహదమవుతున్నట్లు సీపీఐ పేర్కొంది.
ట్రంప్ బెదిరింపులకులొంగొద్దు
- Advertisement -
RELATED ARTICLES


