చందాదారులకు ఈపీఎఫ్‌ఓ హెచ్చరిక
న్యూదిల్లీ : ప్రావిడెండ్ ఫండ్‌కు సంబంధించిన సేవల విషయంలో థర్డ్ పార్టీ ఏజెంట్ల సాయం తీసుకోవద్దని చందాదారులను ఈపీఎఫ్‌ఓ హెచ్చరించింది. కీలక వివరాలు వారికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో సొంతంగానే ఉచిత సేవలు వినియోగించుకోవాలని సూచించింది. చందాదారుల సౌకర్యార్థం సేవలను గతంతో పోలిస్తే సులభతరం చేశామని, వేగం, పారదర్శకత తీసుకొచ్చామని పేర్కొంది. ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన అన్ని సేవలూ ఉచితంగా లభిస్తున్నప్పటికీ ఈ సేవల కోసం కొన్ని సైబర్ కేఫ్‌లు/ ఫిన్‌టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. చందాదారులు ఉచితంగా, సొంతంగా చేసుకోగలిగే వాటికే నగదు వసూలు చేస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా థర్డ్‌పార్టీ సేవలు వినియోగించుకోవడం వల్ల కీలకమైన ఆర్థిక సమాచారం వారికి బయటకు పొక్కే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈపీఎఫ్‌ఓకు అధీకృత సంస్థలేవీ లేవని స్పష్టంచేసింది. కాబట్టి చందాదారులు, యజమానులు, పెన్షనర్లు ఈపీఎఫ్‌ఓ సేవల కోసం ఈపీఎఫ్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించింది. క్లెయిమ్‌ల పరిష్కారం, కేవైసీ అప్‌డేషన్, గ్రీవెన్స్ తదితర సేవలు అందులోనే ఉచితంగానే లభిస్తున్నాయని పేర్కొంది. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్‌డెస్క్‌లనూ సంప్రదించొచ్చని పేర్కొంది. కాగా, అనారోగ్యం, వివాహం, పిల్లల చదువుల వంటి కారణాలపై అడ్వాన్స్ చెల్లింపులకు ఉన్న ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ సదుపాయాన్ని లక్ష రూపాయలకు పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.34 కోట్ల క్లెయిమ్‌లు ఈ మోడ్‌లో పరిష్కారమయ్యాయి.
ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 15 నుంచి ఈపీఎఫ్‌ఓ సరళతరం చేసింది. ఎంప్లాయర్ అనుమతి నిబంధనను తొలగించింది. ఆధార్ అథంటికేషన్‌తో ప్రొఫైల్‌లో కరెక్షన్ చేసుకునే వెసులుబాటునూ తీసుకొచ్చింది. ఎంప్లాయర్‌పై ఆధారపడడాన్ని తగ్గించింది. ఉమాంగ్ యాప్‌లోని ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీ ద్వారా యూఏఎన్ అలాట్‌మెంట్, యాక్టివేషన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. క్లెయిమ్ సెటిల్ మెంట్ కోసం చెక్ లీఫ్/ అటెస్ట్ చేసిన పాస్‌పుస్తకం ఇమేజ్ అప్ లోడిరగ్ అవసరాన్ని తొలగించింది. బ్యాంక్ అకౌంట్ సీడిరగ్‌కు ఎంప్లాయర్ ఆమోదాన్ని కూడా ఈపీఎఫ్‌ఓ తప్పించింది.