Tuesday, November 18, 2025
Homeవిశ్లేషణదిమ్మ తిరిగిన అమెరికా పాలకులు

దిమ్మ తిరిగిన అమెరికా పాలకులు

- Advertisement -

టి.ఎన్‌.అశోక్‌

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య ఆదివారం జరిగిన చర్చలు రెండు దేశాలకు సానుకూలంగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరుధ్యాలు సమసిసోయి స్నేహ సంబంధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇరుదేశాల నాయకుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు అనేక విషయాలలో సానుకూలంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చైనాభారత్‌ దేశాలపైనే గాక, అనేక దేశాల పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అలవిమాలిన సుంకాలను విధించి బెంబేలెత్తించాడు. ఈ సుంకాలు విధించడానికి ప్రభుత్వానికి అధికారంలేదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో ట్రంప్‌ ఏం చేయాలా అని తర్జన భర్జన పడుతున్న సమయంలోనే భారత్‌చైనాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగయ్యే పరిస్థితి కనిపించడంతో ఒక విధమైన ఆందోళనకు గురవుతున్నారు. చైనా నగరం తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభలు జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మోదీజిన్‌పింగ్‌లు విడివిడిగా చర్చలు జరిపారు. పశ్చిమదేశాల నగరాల్లో విధాన నిర్ణయాలను తీసుకునే అధికారులు అలాగే పాలకులు వాస్తవంగా భారత ప్రధాని వాషింగ్టన్‌కు దూరమై చైనాతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకున్నారన్న సూచనలతో ఆశ్చర్యపోతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల సీనియర్‌ దౌత్యవేత్తలు భారత్‌చైనాలలో వచ్చిన మార్పులను చూసి అచ్చెరువ పడుతున్నారు. హిమాలయ వ్యాలీలో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలు భారత్‌చైనాల మధ్య వైరుధ్యాలు తీవ్రంగా ఉన్నాయి. ఆనాటి నుంచి భారత్‌చైనాల మధ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగుదేశాలతో కూడిన క్వాడ్‌సంస్థ సైతం తాజా పరిణామాల పట్ల వ్యతిరేకతను ప్రకటించింది. ఇదే సమయంలో రష్యాతో కలిసి చైనా ఎస్‌సీఓలో తమకు స్థానం ఇవ్వాలని క్వాడ్‌లో కొన్ని దేశాలు కోరుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన క్వాడ్‌కు వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఏకమవుతున్నాయి.
తియాన్‌జిన్‌లో మోదీ జిన్‌పింగ్‌ల మధ్య 50 నిమిషాలపాటు చర్చలు జరిగాయి. సాధారణంగా దౌత్యపరమైన చర్చలు 50 నిమిషాలకుపైగా జరగడం ఉండదు. 2020 లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల నాటి నుంచి భారత్‌`చైనాల మధ్య అనేక అంశాలలో విభేదాలున్నాయి. హిమాలయాల్లోని ఎగువప్రాంతాలలో రెండుదేశాల సైన్యం పలుమార్లు ఘర్షణ పడ్డాయి. రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా నిలిచిపోయాయి. అయితే, భారత్‌కు చైనా నుంచి వాణిజ్యపరమైన వస్తవులు, అనేక రంగాలకు చెందిన ఎగుమతులు జరుగుతున్నాయి. భారత్‌ దేశంనుంచి జరిగే ఎగుమతులు తక్కువగా ఉన్నాయి. ఫలితంగా చైనా భారతదేశంపై అనేక అంశాలలో ఉన్నత స్థాయిలో ఉంది. రష్యా నుంచి భారతదేశం తక్కువ ధరకు ముడిచమురును దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధిచేసి ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారన్న అభిప్రాయం ట్రంప్‌కు ఉన్నది. ఈ విధంగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోకుండా నిలిపివేస్తే భారతదేశంపై 50శాతం సుంకాలు విధించబోనని ట్రంప్‌ షరతు విధించాడు. తాజాగా మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య చర్చలు జరిగి ముఖ్య అంశాలలో సానుకూలత ఏర్పడిరదని తెలియడంతోనే ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ తికమక పడుతున్నారు.
మరోవైపు ట్రంప్‌ ఆరోగ్యంపై తీవ్రమైన వార్తలు వస్తున్నాయి. భారత్‌ మీద 50 శాతం సుంకాలు విధించి అనేక రంగాలకు నష్టం కల్పించినప్పటికీ మోదీ ఏమాత్రం స్పందించకుండా ఎస్‌సీఓ సభల్లో పాల్గొనేందుకు వెళ్లి ప్రత్యేకంగా జిన్‌పింగ్‌తో సాధారణ దౌత్య సంబంధాల చర్చలకంటే వీరివురుమధ్య జరిగిన చర్చలు సానుకూలత ఏర్పడడంపై భారతదేశంలో ప్రభుత్వ వర్గాలు ఇంకా ఇతర పక్షాలు సానుకూల వ్యాఖ్యలు చేశాయి.
ట్రంప్‌ తమకు సన్నిహిత స్నేహితుడని, ట్రంప్‌కు సానుకూలంగా ఎన్నికల్లో ప్రచారంచేసిన మోదీ ఈ అంశంపై ఈరోజు ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితి ఎదురైంది. వివిధపార్టీల రాజకీయాల నాయకులు చాలాకాలంగా చైనా పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగిఉన్నారు. అకస్మికంగా చైనా భారత్‌ల మధ్య ‘‘సాంస్కృతిక స్నేహం’’ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. నిజంగా రెండు దేశాలమధ్య సంబంధాలు ఎక్కువ కాలం నిలుస్తాయా అనికూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చాకచక్యంగా ఇరునాయకుల మధ్య చర్చలు మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని ఆశిస్తున్నారు. రెండు గొప్ప దేశాలమధ్య మెరుగైన సంబంధాలు ఉండటం ఎంతో అవసరం. ముఖ్య అంశాల విషయంలో భారత్‌ తప్పుచేస్తోంది. అయితే భారత్‌ విదేశాంగ విధానంలో పొరపాట్లు అరుదుగా జరుగుతాయి. ప్రచ్ఛన్నయుద్ధం నాటినుంచి న్యూ దిల్లీ వ్యూహాత్మకమైన స్వయంప్రతిపత్తిని కోరుతున్నది. అయితే ఈ అంశాలలో సానుకూలతను సాధించలేకపోయింది. పశ్చిమదేశాలు ఆంక్షలను విధించడం వలన ఆర్థిక మాంద్యంనుంచి బైటపడుతున్నామని జిన్‌పింగ్‌ తెలిపారు. అమెరికా మనపైన కక్షతీర్చుకున్నట్లుగా ప్రవర్తించడంతో సంబంధాలు దెబ్బతిన్న నేపధ్యంలో బీజింగ్‌ భారత్‌ను కౌగలించుకుంటుందా? అని భావిస్తున్నారు. ట్రంప్‌ సుంకాలు, రాజకీయాలు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం మోదీ ప్రభుత్వాన్ని కల్లోలపరుస్తున్నాయి. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో కానీ చైనా పట్ల అనేక సందేహాలను కొందరు రాజకీయ నాయకులు, పత్రికా రచయితలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది కాలంలో పూర్తి సమాచారం వ్యక్తం అవుతుందని ఆశిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు