Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయందెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం

దెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం

- Advertisement -

ఐఏఈఏ ధ్రువీకరణ
వియన్నా: ఇజ్రాయిల్`అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్‌లోని ప్రముఖ అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌కు కొంత నష్టం జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నిర్ధరించింది. అయితే ప్రజలకు లేదా పరిసర ప్రాంతాలకు ఎలాంటి రేడియేషన్ ప్రమాదం లేదని స్పష్టం చేసింది. వియన్నా నుంచి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. భూగర్భ భాగానికి వెళ్లే ప్రవేశ భవనాలు కొంత దెబ్బతిన్నాయని ఐఏఈఏ తెలిపింది. ప్రధాన అణు శుద్ధి వ్యవస్థలు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడుల నేపథ్యంలో ఈ నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ అణు పదార్థాలు బయటకు లీక్ కాలేదని, రేడియోలాజికల్ ప్రభావం ఏమీ ఉండదని ఐఏఈఏ నిపుణులు హామీ ఇచ్చారు. ఈ పరిణామంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అణు కేంద్రాలపై దాడులు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని… ఎప్పటికప్పుడు తదుపరి నివేదికలను విడుదల చేయనున్నట్లు ఐఏఈఏ పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు