Homeఆంధ్రప్రదేశ్నల్లబారిన తెల్ల బంగారం

నల్లబారిన తెల్ల బంగారం

- Advertisement -

పత్తి రైతుకు కాలం కలిసి రావడం లేదు. ఏటా దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. వాతావరణ పరిస్థితులకు తోడు పత్తి తీసే సమయంలో అధిక వర్షాలతో చేలన్నీ తెగుళ్ల బారిన పడ్డాయి. చెట్ల మీదే కాయలు కుళ్లి నేలరాలుతున్నాయి. పత్తి తడిసి ముద్దవడంతో తెల్లబంగారం కాస్తా నల్లబారింది. మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర ఉన్నప్పటికీ… దిగుబడి లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులైనా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.

పత్తి రైతుకు కలిసిరాని కాలం

. వరుస వర్షాలతో పంట నష్టం
. చెట్లమీదే కుళ్లి నేలరాలుతున్న కాయలు
. ముందే మొలకెత్తుతున్న గింజలు
. పెట్టుబడులు రాక అన్నదాత విలవిల

విశాలాంధ్ర-సచివాలయం: ఆరుగాలం కష్టించి పత్తిసాగు చేసిన రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు పత్తి పంటను ముంచుతూ కర్షకుడికి కన్నీటిని మిగుల్చుతోంది. ఇటీవల కురిసిన వానలు పత్తికి శరాఘాతంలా మారాయి. రోజూ పడుతున్న వర్షంతో చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ ఏడాది పత్తి పంట రైతులను చిత్తు చేసింది. అధిక వర్షాలకు గిడసబారి పత్తి కాయ పగిలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షాలు పడుతుండడంతో పూత రాలిపోయి… కాయలు మచ్చలు వచ్చి రాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గూడ, పూత, కాయ సమయంలోనే ఎడతెరిపిలేకుండా కురిసిన వర్గాలతో గూడ మొత్తం రాలిపోయింది. పంటలన్నీ ఎర్రబారి పోయాయి. పత్తి రైతుల ఆశలు ఆవిరైపో యాయి. తెల్ల బంగారం రైతులు తెల్లపోయారు. చెట్టుకు నాలుగైదు కాయాలు పగలితే తీయటానికి వీలు లేకుండా పోయింది. అంతేకాకుండా తడిసి ముద్దయి పత్తి కాయల గింజలన్నీ మొలకెత్తాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పత్తి రైతులు కన్నీరు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. పత్తి పంటకు పచ్చ పురుగు, గులాబీరంగు పురుగు, చీడపీడలకు మంచి మందులు పిచికారీ చేస్తే పంటలు దక్కేవి. కానీ, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పత్తి చేలన్నీ ఎర్రబారిపోయాయి. ఖరీఫ్‌ మొదట్లోనే బోరు బావుల కింద రైతులు పత్తిసాగు చేశారు. వర్షాలు పడనప్పటికీ ఉన్న బోరు నీటిని ఉపయోగించారు. చేను ఏపుగా పెరిగి గూడ కూడా బాగానే పడిరది. కానీ, గూడపగులుతున్న సమయంలోనే వర్షాలు మొదలు కావడంతో గూడ పూర్తిగా రాలిపోయింది. ఏదేమైనప్పటికీ రైతు ఏటేటా ఏదో ఒక విధంగా నష్టపోతూనే ఉన్నాడు. సాగు మొదట్లో సమయానికి వర్షాలు లేక ఇబ్బందులు పడిన రైతులు పత్తి తీసే సమయానికి ప్రతిరోజూ వర్షం కురుస్తుండడంతో చెట్టుమీదే పత్తి తడిసి నల్లబారింది. తీసే పత్తిలోనూ గింజలు మొలకెత్తుతండడంతో సిరులు కురిపిస్తుందనుకున్న తెల్లబంగారం తమను అప్పుల ఊబిలోకి నెట్టిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. యేటా రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతూ సాగు చేస్తున్నప్పటికీ వాతావరణం అనుకూలించక నష్టాలను చవిచూ స్తున్నారు. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు వివరీతంగా పెరిగాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు ధర రూ.20 వేల వరకు ఉండగా… ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతుంది. దీనికి తోడు ప్రభుత్వం రైతులను ఉత్సాహపరుస్తూ ఈసారి పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలు రూ.8,110గా పెంచింది. సీసీఐ కొనుగోలు ప్రారంభించకపోతే ఆ ఎంఎస్‌పీ రైతులకు ఎలా అందుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ధర పెంచడం ఒక్కటే సరిపో దు… మార్కెట్లో ఆ ధరకు కొనుగోలు జరగాలి. లేకపోతే ఎంఎస్‌పీ కాగితంపైనే మిగిలిపోతుందిని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు