Homeనాడు కేజీఎఫ్…నేడు జీజీఎఫ్

నాడు కేజీఎఫ్…నేడు జీజీఎఫ్

- Advertisement -

సీమకు పూర్వ వైభవం… స్వర’గిరిగా జొన్నగిరి
ఆభరణాల తయారీకి ఇక్కడే జ్యుయలరీ పార్క్
గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – పత్తికొండ: జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారం వెలికితీతతో రాష్ట్రంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని, సీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు కేజీఎఫ్…ఇప్పుడు జీజీఎఫ్ అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో జియో మైసూర్ – డెక్కన్ గోల్డ్ మైన్స్‌ సంస్థలు ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శుద్ధి చేయాల్సిన బంగారు ఖనిజంతో కూడిన మట్టిని తీసుకెళ్లే భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సీఎం సందర్శించారు. రూ.405 కోట్ల పెట్టుబడితో జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్‌ సంస్థలు బంగారాన్‌ని తవ్వి, ప్రాసెస్ చేసి విక్రయించనున్నారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌లో తొలి ఏడాది 400 కేజీలతో మైనింగ్ ప్రారంభించి తదుపరి దశలో 900 కేజీలు, అనంతరం 2 టన్నుల వరకూ బంగారాన్‌ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. జియో మైసూర్ – డెక్కన్ గోల్డ్ మైన్స్‌ సంస్థలు జొన్నగిరిలో తవ్వకాలు జరిపి ముడి ఖనిజం నుంచి బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఉత్పత్తి యూనిట్లలోని వేర్వేరు విభాగాలను పరిశీలించారు. బంగారు బిస్కట్లు సహా వివిధ రూపాల్లోని తుది ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకూ జరిగే ప్రక్రియలను జియో మైసూర్ సంస్థ చైర్మన్ ప్రభాకరన్, ఎండీ నవీన్ లాల్ చంద్ర సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర చరిత్రలో సువర’ అధ్యాయం మొదలైందని…దీనికి రతనాల సీమ అయిన రాయలసీమ కేంద్రమైందన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడం శుభపరిణామమన్నారు. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారన్నారు. ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్‌ని అందించిన ఘనత మన రాష్ట్రనిదేనని… కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశామని… గోల్డ్ మైనింగ్ తో సీమకు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతానికి జొన్నగిరి బదులు స్వర’గిరి అని పేరు పెట్టుకుందామన్నారు. తొలి ఏడాది 400 కిలోలు నుంచి ప్రారంభమై 50 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉత్పత్తికి చేరుకుంటామని… దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంలో కొంత మేరైనా తగ్గుతుందని…విదేశీ మారక నిల్వల్ని కొంత కాపాడుకోవచ్చునని తెలిపారు. బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్‌కు కూడా ఏర్పాటు చేసి… స్వర’గిరి నుంచి పటిష్ట భద్రత నడుమ ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్ ద్వారా బంగారం తరలించే ప్రాజెక్టు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర’ మాత్రమే కాదు…రత్నగర్భ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పండని పంటలు, దొరకని ఖనిజాలు లేవని… ఈ వనరులను సద్వినియోగం చేసుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2028లో ఉత్పత్తి లక్ష్యంగా కడప జిల్లాలో జులై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.
మన బంగారం… మన వ్యాపారులకే
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జొన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ ను జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్‌ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి బహూకరించాయి. బంగారంతో తయారు చేసిన ఈ జ్ఞాపికను అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో ప్రతిష్టిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌ నుంచి ఉత్పత్తి అయిన బంగారాన్‌ని రాష్ట్రంలోని జ్యుయలరీ కంపెనీలకు ముఖ్యమంత్రి అందించారు. ఏపీలో ఉత్పత్తి అయిన బంగారం రాష్ట్రంలోని వ్యాపారులకే విక్రయిస్తామని జియో మైసూర్ సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు