Thursday, December 11, 2025
Homeఅంతర్జాతీయంనెదర్లాండ్స్‌లో డీ 66 ఘన విజయం

నెదర్లాండ్స్‌లో డీ 66 ఘన విజయం

- Advertisement -

మధ్యేవాద వామపక్షానికి డచ్‌ ప్రజల ఓటు
పార్లమెంటులో మూడు రెట్లు పెరిగిన పార్టీ బలం
తొలి గే ప్రధానిగా యువ నేత రాబ్‌ జెట్టన్‌కు పగ్గాలు

ది హేగ్‌: నెదర్లాండ్స్‌ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యేవాద వామపక్ష పార్టీ డీ 66 ఘన విజయం సాధించింది. పార్లమెంటులో దాని స్థానాలను మూడు రెట్లు పెంచుకున్నది. 2023లో రికార్డు మెజారిటీ సాధించిన ఫ్రీడమ్‌ పార్టీ (పీవీవీ)ని ఘోరంగా ఓడిరచింది. డచ్‌ ట్రంప్‌గా పేరు గాంచిన పీవీవీ నాయకుడు గ్రీట్‌ విల్డర్స్‌ను డీ 66 ప్రధాని అభ్యర్థి రాబ్‌ జెట్టన్‌ చిత్తు చేశారు. తాను గే అని ఆయన ప్రకటించుకున్న నేపథ్యంలో దేశానికి తొలి గే ప్రధాని కాబోతున్నారు. అదే సమయంలో పిన్న వయస్సు ప్రధానిగానూ 38 ఏళ్ల రాబ్‌ జెట్టన్‌ పగ్గాలు చేపట్టబోతున్నారు. డీ 66 గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. విద్వేష రాజకీయాలకు స్వస్థి పలకబోతున్నామని విజయోత్సవ సభలో రాబ్‌ జెట్టన్‌ ఉద్ఘాటించారు. అతివాదాన్ని సైతం ఓడిరచవచ్చని నెదర్లాండ్స్‌కే కాదు మొత్తం ప్రపంచానికి నిరూపించామన్నారు. డచ్‌ ప్రజలు విద్వేషపూరిత ప్రతికూల రాజకీయాలకు స్వస్థి పలికారని ఆయన అన్నారు. గృహ సమస్య, విద్యా రంగంలో పెట్టుబడులు, ఇమ్మిగ్రేషన్‌ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ ఇచ్చిన హామీలతో గత నెల రోజుల్లో జెట్టన్‌కు ప్రజాదరణ భారీగా పెరిగింది. యూరప్‌లో పేరుగాంచిన నాయకుల్లో ఒకరైన గ్రీట్‌ విల్డర్స్‌ మతతత్వవాది. ముస్లింల వ్యతిరేకి. శరణార్థి విధానాన్ని తిరస్కరించాలని, ఉక్రెయిన్‌ శరణార్థులను తిరిగి పంపించాలని, విద్యుత్‌`ఆరోగ్య సంరక్షణ రంగాలకు ఆర్థిక తోడ్పాటు కోసం సంక్షేమ నిధి నిలిపివేయాలని ఆయన ప్రతిపాదనలు చేశారు. దీంతో ఆయన మతతత్వవాద సిద్ధాంతాలను డచ్‌ ప్రజలు తిరస్కరించారు. డీ 66ను గెలిపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు