విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు తీసుకొచ్చిన జీవోలు 590, 847 ప్రతులను ఈనెల 14వ తేదీన భోగిమంటల్లో వేసి దహనం చేయాలని సీపీఐ పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లోను జీవోలు భోగి మంటల్లో కాల్చనున్నారు. విజయవాడ దాసరి భవన్ దగ్గర వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ విజ యవాడ నగర సమితి అధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు జీవోలు 590, 847లను భోగిమంటల్లో వేసి దహనం చేస్తారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, పార్టీ నేతలు పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు ఆయా జీవోలను తగలబెట్టి… వినూత్నంగా నిరసన తెలియజేస్తారు. వైద్య విద్యా విధానంలో పీపీపీ వలన రాష్ట్రంలోని పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రజారోగ్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం దాపురించింది. ఇప్పటికే వైద్య కళాశాలల్లో ప్రైవేటీకరణ విధానాల్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు నిర్వహించింది. ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. ఈ జీవోలు భోగి మంటల్లో పడేసి దగ్ధం చేయాలని గుజ్జుల ఈశ్వరయ్య కోరారు.
నేడు భోగి మంటల్లో 590, 847 జీవోలు దహనం
- Advertisement -
RELATED ARTICLES


