Homeతెలంగాణసమసమాజ స్థాపనే లక్ష్యం

సమసమాజ స్థాపనే లక్ష్యం

- Advertisement -

. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండా
. రైతాంగానికి వెన్నుదన్ను సీపీఐ
. శతవసంత్సోవ ప్రచార సభలో బాగం, కొండపర్తి

విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: సీపీఐ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పనిచేసిందని, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో విచ్చేసి ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న శతవసంతోత్సవ ముగింపు మహాసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా మంగళవారం బైపాస్‌ రోడ్డులో ఎర్ర బెలూన్లు ఎగురవేయగా… నగరంలో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాగం మాట్లాడుతూ… సీపీఐ శతాబ్ది ఉత్సవం సబ్బండ వర్గాల సంబురమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడిరది సీపీఐ మాత్రమేనని గుర్తు చేశారు. త్యాగాలు వృథా కాలేదని , వందేళ్ల పోరాటంలో దున్నేవాడికే భూమి దక్కిందని, బ్యాంకుల జాతీయ కరణ జరిగిందని, శ్రమ దోపిడీ నుంచి కార్మికులకు విముక్తి కలిగిందని, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడగలిగామని వివరించారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు ప్రజలను సంసిద్ధులను చేసేందుకే శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలకులు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నించడమే లక్ష్యంగా వందేళ్ల ప్రయాణం సాగిందన్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థి, యువజనులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన బహుముఖ పోరాటాలు చేసిందని తెలిపారు. ఈ పోరాట క్రమంలో అనేక మంది అమరులయ్యారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు పోరాటాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అధికారం… సీట్లు… ఓట్ల కోసం కమ్యూనిస్టు పార్టీ పుట్టలేదని, కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం సమసమాజ స్థాపనేనని అన్నారు. కొండపర్తి మాట్లాడుతూ… ఆవిర్భావం నుంచి రైతాంగ సమస్యలపై పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని తెలిపారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. రైతుల పోరాట ఫలితంగా నల్ల చట్టాలకు వెనక్కి తగ్గినట్లే తగ్గి దొడ్డిదారిన ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం… పరిరక్షణ కమ్యూనిస్టు పార్టీ పోరాటాలతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తొలుత సీపీఐ కార్యాలయం వద్ద గోవిందరావు జెండా ఊపి ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. బైపాస్‌ రోడ్డు, బస్పో, మయూరిసెంటర్‌, వైరా రోడ్డు, జెడ్పి సెంటర్‌, ఇల్లందు క్రాస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ విగ్రహం, బైపాస్‌ మీదుగా సాగింది. జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌ రెడ్డి , మేకల శ్రీనివాసరావు, ఏనుగు గాంధీ, జిల్లా కార్యవర్గ సభ్యులు బీజీ క్లెమెంట్‌, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్‌. సీతామహాలక్ష్మి, యానాలి సాంబశివరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మి నారాయణ, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా నాయకులు తాటి నిర్మల, నూనె శశిధర్‌, వరదా నర్సింహారావు, బోడా వీరన్న, జ్వాలా నర్సింహారావు, రైతు సంఘం నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, బానోత్‌ రాంకోటి, బాగం ప్రసాద్‌, ఏలూరి భాస్కరరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు