మళ్లీ భారీ వర్షాలు, వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు ప్రజలు బిక్కుబిక్‌కు
ఖాటˆండు: హిమాలయ దేశానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోమారు భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రకృతి విపత్తు నుంచి తేరుకోని ప్రజలు తాజా పరిస్థితులతో బిక్కుబిక్కుమంటున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదుల ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో దేశమంతటా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు. నేపాల్ హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ విభాగం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ ప్రకారం బుధవారం ఉదయం 6 గంటలప్పటికి మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని దాటాయి. సింధూలి జిల్లాలోని సన్ కోశీ నది, గూర్ఖా జిల్లాలోని బుధి గండకి నది, దడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదులు ఉప్పొంగాయి. లమ్జంగ్ జిల్లాలోని మరస్యూంగ్ది నదిలో ప్రవాహం ప్రమాద స్థాయిని మించిపోయింది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. దాంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ముప్పు ఏర్పడింది. మరస్యూంగ్ది నది దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. రాజధాని ఖాటˆండు సహా అనేక ప్రాంతాýను వర్షాలు ముంచెత్తుండటంతో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరికలు/గమనికలు జారీచేస్తోంది.
1,127కు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 1,127కు చేరుకున్నది. మృతదేహాలకు తాత్కాలిక ఖననం కొనసాగుతోంది. ఖాటˆండులోని గోకర్ణలో శవాల పాక్షిక ఖనన కార్యక్రమం జరుగుతోంది. మృతుల డీఎన్‌ఏ నమూనాలుT, ఫోటోలు, ఇతర కీలక సమాచారాన్ని భద్రపరుస్తున్నారు. చిత్వాన్లో 348 మృతదేహాలు లభ్యం కాగా నావల్పారసి ఈస్ట్‌లో 217, 190 నావల్పారసి వెస్ట్‌లో, నువాకోట్‌లో 155, గూర్ఖాలో 66, దాడింగ్‌లో 59, రసువాలో 45, తానాహులో 36 చొప్పున మృతదేలను వెలికితీశారు.1,113 మృతదేహాలకు శవపరీక్షలు, గుర్తింపు ప్రక్రియలు పూర్తి చేశారు. మరో 95 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గుర్తు తెలియని 911 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీసులు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. కాగా, 6,541 మందిని భద్రతా సిబ్బంది కాపాడారు. ఇంత వరకు ఆచూకీ లభించని 4,858 మంది కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.


